Political News

గ్లోబల్ సమ్మిట్ కోసం గ్లోబును చుట్టేస్తున్న రేవంత్ సర్కార్

డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే  భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. ఈ నెల 4న తెలంగాణ మంత్రులు స్వయంగా వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. దావోస్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు దీటుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకోసం గ్లోబును చుట్టేయాలన్నంత కమిట్మెంట్ తో వ్యవహరిస్తోంది.  

ఎంపీలకు, కేంద్ర మంత్రులకు, గవర్నర్లకు టీ కాంగ్రెస్ ఎంపీలు ఇన్విటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మొదలు సత్య నాదెళ్ల వంటి మేధావులు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి దిశలో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి’ అనే నినాదంతో ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ సాధించేలా రోడ్‌మ్యాప్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తెలంగాణ భవిష్యత్తుకు అద్దం పట్టేలా “తెలంగాణ రైజింగ్ 2047” పేరిట రూపొందించిన డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సమ్మిట్ లో 500 కంపెనీల నుంచి 1000 మందికి పైగా డెలిగేట్లు పాల్గొనబోతున్నారు. భవిష్యత్ భారత్ కు తెలంగాణ కీలకం కానుందన్న థీమ్ తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.

This post was last modified on December 3, 2025 3:11 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

5 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago