దివ్యభారతి అంటే నిన్నటితరం, దివంగత స్టార్ హీరోయినే గుర్తుకు వస్తుంది చాలామందికి. కానీ ఈ తరంలోనూ ఈ పేరుతో ఒక అందమైన హీరోయిన్ ఉంది. ఆమెకు తమిళంలో మంచి పాపులారిటీనే ఉంది. హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో ఆమె మంచి ఫాలోయింగే సంపాదించింది. తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్‌తో వరుసగా బ్యాచిలర్, కింగ్‌స్టన్ సినిమాలు చేసిందా అమ్మాయి. ఇందులో బ్యాచిలర్ మూవీ బాగా ఆడింది. దివ్యభారతికి మంచి పేరూ తెచ్చిపెట్టింది. విజయ్ సేతుపతి మూవీ ‘మహారాజా’లోనూ చిన్న పాత్ర చేసింది దివ్యభారతి.
ఐతే ఎన్నో ఆశలతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఆమెకు ఇక్కడ చేదు అనుభవాలు తప్పలేదు. సుడిగాలి సుధీర్ లాంటి చిన్న హీరోతో ‘గోట్’ అనే మూవీకి సంతకం చేసిందామె. కానీ ఈ సినిమాకు మధ్యలో అనుకోని ఇబ్బందులు తలెత్తాయి. దర్శకుడు నరేష్ కుప్పిలిని మధ్యలో నిర్మాత తప్పించాడు. షూట్ పూర్తయ్యాక సుధీర్ సైతం ఈ సినిమాను పక్కన పెట్టి వెళ్లిపోయాడు. డబ్బింగ్ కూడా పూర్తి చేయలేదట.
మధ్యలో నరేష్ కుప్పిలి.. సోషల్ మీడియాలో పోస్టులో దివ్యభారతిని ఉద్దేశించి ‘చిలకా’ అంటూ డీగ్రేడింగ్ కామెంట్లు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై దివ్యభారతి సీరియస్ అయింది. తాజాగా ‘గోట్’ నిర్మాతతో కలిసి ఆమె టీజర్ లాంచ్ వేడుకకు హాజరైంది. ప్రెస్‌తోనూ మాట్లాడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా గొడవ గురించి దివ్యభారతిని మీడియా వాళ్లు అడిగితే.. ఆమె మరో షాకింగ్ విషయం చెప్పింది. సుధీర్ ప్రస్తుతం ‘హైలెస్సో’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు దర్శకుడు వేరొకరు అయినా.. నరేష్ కుప్పిలి మేకింగ్ చూసుకుంటున్నాడు.
ఆ టీం నుంచి దివ్యభారతికి ఒక మెసేజ్ వచ్చిందట. ‘హైలెస్సో’లో ఐటెం సాంగ్ చేస్తారా అని అడిగారట. ముందు ఇది మామూలు మెసేజే అనుకుందట దివ్యభారతి. కానీ నిర్మాత, ఆమె కలిసి విషయం ఆరా తీస్తే.. నరేష్ దీని వెనుక ఉన్నాడని.. తనను రెచ్చగొట్టడానికి, అవమానించడానికే ఇలా మెసేజ్ పెట్టారని తెలిసిందని.. ఇది ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది. ‘గోట్’ మూవీ విషయంలోనూ నరేష్ ఏం చేశాడో అంతా తెలిసినా.. సుధీర్ ఏమీ మాట్లాడలేదని.. ఇప్పటికీ తనకే సపోర్ట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక అమ్మాయితో ఇలాగేనా వ్యవహరించేది అని ఆమె ప్రశ్నించింది.
This post was last modified on December 3, 2025 3:09 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…