వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న కొందరు.. కూటమి ప్రభుత్వం రాగానే.. తమ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి రాజీనామాలు గత ఏడెనిమిది నెలలుగా చైర్మన్ మోషేన్ రాజు దగ్గర పెండింగులో ఉన్నాయి. అయితే.. ఎప్పటికీ వీటిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించేలా చైర్మన్‌ను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు చైర్మన్‌ను ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేస్తూ.. నాలుగు వారాల గడువు ఇచ్చింది.
వచ్చే నాలుగు వారాల్లో ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన వారివి ఆమోదించడమో.. తిరస్కరించడమో.. చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో చైర్మన్ మోషేన్ రాజు.. జయమంగళ వెంకటరమణ సహా.. వైసీపీ నుంచి బయటకు వచ్చి తమ పదవులకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల నుంచి సోమవారం వివరణ తీసుకున్నారు. వీరిలో కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జకియా ఖానుం, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత ఉన్నారు. వీరిని ఒక్కొక్కరిగా తన ఛాంబర్‌లోకి ఆహ్వానించిన చైర్మన్.. వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా వారిని 3 ప్రశ్నలు అడిగారు.
1) రాజీనామా చేయడానికి గల కారణం?
2) రాజీనామా చేయాలని ఏ వ్యక్తి అయినా.. ఏ పార్టీ అయినా ప్రోత్సహించిందా?
3) రాజీనామా స్వచ్ఛందమా..? ఎవరైనా వత్తిడి చేశారా?
అనే ఈ మూడు ప్రశ్నలను ఎమ్మెల్సీలకు సంధించారు. దీనికి వారంతా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని.. ఎవరి ప్రోద్బలం లేదని వివరణ ఇచ్చారు. అయితే.. కర్నూలు జిల్లాకు చెందిన మండలి వైస్ చైర్మన్ జకియా ఖానుం మాత్రం.. తొలుత తన రాజీనామా వ్యవహారంలో ఎవరి ప్రోత్బలం లేదని.. తాను స్వచ్ఛందంగానే రాజీనామా సమర్పించానని చెప్పారు. అయితే.. ఆ వెంటనే తన రాజీనామాను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్టు జకియా ఖానుం ప్రకటించారు. చైర్మన్ ఛాంబర్‌లోకి వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరారు. అయితే.. ఇలా ఆమె ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్నది తెలియరాలేదు.
మిగిలిన వారంతా.. స్వచ్ఛందంగా రాజీనామా చేశామని.. ఆమోదించాలని కోరారు. కాగా.. వీరిలో మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు.. టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, జకియా ఖానుం పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. కాగా.. చైర్మన్.. మోషేన్‌రాజు వీరి రాజీనామాలను ఆమోదించకుండా.. అనర్హత వేటు వేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జకియా ఖానుం తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 2, 2025 7:38 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…