కర్ణాటక రాజకీయాల్లో గత నెల రోజులుగా తీవ్ర ప్రతిష్టంభనం నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీటు కోసం ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యాపారవేత్త మరియు పార్టీ కీలక నాయకుడు డీకే శివకుమార్ భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం ఆయన చేసిన శ్రమ అందరికీ తెలిసిందే. దీంతో అసలు సీఎం సీటు కోసం అప్పట్లోనే ఆయన ప్రయత్నించారు.
కానీ, కుల సమీకరణలు మరియు డీకేపై అప్పట్లో ఉన్న కేసుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మౌనంగా ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత సిద్దరామయ్యకు పట్టంకట్టింది. ఆ సమయంలో రెండున్నరేళ్ల ఒప్పందం జరిగిందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అంటే రెండున్నరేళ్ల తర్వాత సిద్దరామయ్య పదవి విడిచి డీకేకు అప్పగిస్తారన్న వాదనను శివకుమార్ వర్గం ప్రచారం చేసింది. ఈ క్రమంలో రెండున్నరేళ్లు పూర్తయిన వెంటనే ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది.
గత నెల రోజులుగా రాష్ట్ర పరిస్థితి కూడా ఇలాగే ఉద్రిక్తంగా ఉంది. దీనిపై అధిష్టానం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిద్దరామయ్యను మారిస్తే ఇబ్బందులు తటస్థం కావన్న భావనతో అధిష్టానం ఆయనకే మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఇరు వర్గాలను రాజీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా సీఎం సిద్దరామయ్య తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీనికి డీకేతో పాటు ఆయన మద్దతుదారులు, మంత్రులు హాజరయ్యారు. లోపల ఏం మాట్లాడుకున్నారో అధికారికంగా వెల్లడించలేదు. కానీ మీడియా ముందు మాత్రం సిద్దరామయ్య, శివకుమార్‌లు పరస్పరం నవ్వుతూ కనిపించారు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఆప్యాయంగా ఉన్నామని చెప్పారు. కలిసి పనిచేస్తామని, 2028 ఎన్నికలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
విందు కూడా అదే ఉద్దేశ్యంతో నిర్వహించామని సిద్దరామయ్య చెప్పగా, తన ఆలోచన కూడా అదే అని డీకే తెలిపారు. కానీ ఈ విందు వెనుక అసలు రాజకీయాలు వేరే ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఇద్దరూ ఆ అంశాన్ని వ్యూహాత్మకంగా దాటవేయడం గమనార్హం.
This post was last modified on November 29, 2025 6:38 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…