తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో మాజీ ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తాజాగా కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడని వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక యోధుడి దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందంటూ కవిత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే కవితపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ యోధుడి పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడడం లేదని, కానీ ఆయన వల్లే కవిత ఇన్నాళ్లు పదవులు అనుభవించిన విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా కవితకు ఉనికి లేదని, అటువంటి నాయకుడిని సొంత కూతురు అయిన కవిత విస్మరించడం ఏంటని మండిపడుతున్నారు.
కేసీఆర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటే, కన్న కూతురు మాత్రం ఈ రకంగా అవమానిస్తోందని అంటున్నారు. కేసీఆర్ ఫొటో లేకుండా కవిత ఎక్స్ లో చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. కేసీఆర్ ఇమేజ్ లేకుండా కవిత పోస్ట్ చేశారని, కానీ ఇన్నాళ్లు ఆయన ఇమేజ్ వాడుకొని రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టారని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడైనా కవితకు సొంతగా ఇమేజ్ ఉందనుకుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున సొంతంగా పోటీ చేసి గెలవాలని నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates