పరదాల మాటున పవన్ కళ్యాణ్ టూర్లు అంటూ… వైసిపి చేస్తున్న ఆరోపణలను జనసేన పార్టీ తిప్పి కొట్టింది. పీ అంటే పరదాలు, కే అంటే కంచెలు అని వైసీపీ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో పరదాలు, కంచెలతో ప్రజలెవరూ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పకుండా ఆంక్షలు.. ఒకవేళ చెప్పడానికి వస్తే… మైక్ కట్..! చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ప్రజా సమస్యలు వినడానికి కూడా ఇంత భయం ఎందుకు? అంటూ ఆ పార్టీ ప్రశ్నించింది. పవన్ పర్యటనలో పరదాలు కట్టిన ఫోటోలను విడుదల చేసింది.
దీనికి జనసేన ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. తమరు పెట్టిన మొదటి ఫోటోకి సంబంధించిన వీడియో ఇది.. అంటూ పోస్ట్ చేసింది. ఆ పరదా వెనుక ఉన్న గృహంలోని గృహిణి బయటకొచ్చి ప్రభుత్వం తమకి కల్పించిన మ్యాజిక్ డ్రెయిన్ సౌకర్యం గురించి ఉపముఖ్యమంత్రికి నవ్వుతూ సంతోషంగా కృతజ్ఞతలు తెలిపిందని వివరించింది. మీ తరహా పరదాల వాడకం కాదు ఇది.. అంటూ సెటైర్లు వేసింది.
ఇక రెండో ఫోటోలోని కంచె పార్టీ కేంద్ర కార్యాలయం బయట ఉన్న గేటును ఆనుకుని ఉన్నది. అంటే తమ మాదిరి క్యాంపు కార్యాలయానికి పెద్ద పెద్ద బోనులు కడితే అక్షేపణీయం కానీ గేటుకి ఆనుకుని కంచె ఉంటే తప్పేముంది! అని ప్రశ్నించింది. అసలంటూ జగన్ పాలన వెలగబెట్టిన ఐదేళ్లలో ప్రజలను కలవడం, వారి సమస్యలు వినడం లాంటివి చేస్తే ఇవి అర్థమయ్యేవి అని జనసేన పేర్కొంది. దీనిలో మిమ్మల్ని నిందించడం కూడా సమంజసం కాదులే.. పాపం మీరేం చేస్తారు!! అంటూ ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది.
This post was last modified on November 29, 2025 11:07 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…