వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేశారు. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. దీంతో మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు.
ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేర్కొన్నారు. మావోయిస్టుల చర్యలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు మృతిచెందారు.
ఈ క్రమంలోనే ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కూడా కొద్ది రోజుల క్రితం ఒక వీడియో విడుదల చేశారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా.. అని ఆర్ వీడియోలో పేర్కొన్నారు.
కొన్ని దశాబ్దాల కిందట పీడిత ప్రజల కోసం మొదలైన పీపుల్స్ వార్ ఉద్యమం చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. దాడులు, ప్రతిదాడులు.. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. రెండేళ్ల నుంచి ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లో జరుగుతున్నాయి. ఉద్యమం వేగంగా బలహీనపడుతూ చివర దశకు వచ్చేసింది.
మావోయిస్టు నేతలు లొంగిపోయారు.. లేదంటే పోలీసుల తూటాలకు ప్రాణాలు వదిలారు. అగ్రనేతలనుకున్న వారు కూడా ఉద్యమానికి భవిష్యత్తు లేదనే భావనతో భారీ సంఖ్యలో క్యాడర్ ను తీసుకుని మరీ లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే జనవరి ఒకటో తేదీ నుంచి ఆయుధ విరమణ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
This post was last modified on November 28, 2025 12:19 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…