Political News

అమరావతిలో అన్ని వర్గాల వారికి నివాసం

దేవ‌తల రాజ‌ధాని మాదిరిగానే అమ‌రావ‌తిని నిర్మిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇక్క‌డ అన్ని వ‌ర్గాల‌కు నివ‌సించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతాయ‌ని చెప్పారు. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాల‌ను ప్ర‌భుత్వం గుర్తు పెట్టుకుంటుంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలో నిర్మిస్తున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అనుబంధ శ్రీవారి ఆల‌యం రెండో ద‌శ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు భూమి పూజ చేశారు.

ఇప్ప‌టికే 140 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో తొలి ద‌శ ప‌నులు పూర్త‌య్యాయి. రెండో ద‌శ‌లో 260 కోట్ల రూపాయ ల వ్య‌యం కాగ‌ల ప‌నుల‌కు ఈ రోజు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు ఈరోజు జ‌రి గిన కార్య‌క్ర‌మంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ నిర్మాణాల్లో ఆల‌య ప్రాకారం, మ‌హాగోపురం, ఆల‌య విస్త‌ర‌ణ వంటివి ఉన్నాయి. వీటిని రెండు నుంచి మూడు ద‌శ‌ల్లో నిర్మించ‌నున్నారు. ఈ నిర్మాణాల‌కు భూమి పూజ చేసిన అనంత‌రం.. సీఎం మాట్లాడారు.

రాష్ట్రంలో రాజ‌ధాని ప్రాధాన్యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలియాల‌న్నారు. గ‌తంలో కొంద‌రు త‌ప్పులు చేశార‌ని.. వెం ట‌నే శ్రీవారు అలాంటి వారిని శిక్షించార‌ని ప‌రోక్షంగా వైసీపీని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల‌కు చంద్ర‌బాబు అభినంద‌న‌లు తెలిపారు. వారి త్యాగాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకుంటార‌ని చెప్పారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారికి ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేరుస్తామ‌ని సీఎం తెలిపారు.

రాష్ట్ర రాజ‌ధాని అంటే కేవ‌లం ఒక ప్రాంతం కాద‌న్న చంద్ర‌బాబు.. ఇదొక మ‌హాన‌గ‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. దేశానికే త‌ల‌మానికంగా దీనిని తీర్చిదిద్ద‌నున్న‌ట్టు సీఎం చెప్పారు. అనేక ప్రాంతాల నుంచి వ‌చ్చిన కార్మి కులు ఇక్క‌డ రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, త్వ‌ర‌లోనే ప‌నులు పూర్తి చేస్తామ‌ని తెలిపారు. రాజ‌ధానిని దేశానికి త‌ల‌మానికంగా నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు. తొలిద‌శ ప‌నులు 2027 నాటికి పూర్తి చేసేలా కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. 

This post was last modified on November 27, 2025 12:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

27 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago