Political News

పోల‌వరానికి మ‌హ‌ర్ద‌శ‌.. కొత్త జిల్లాతో మార్పులు ఇవే

పోల‌వ‌రం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పేరు అంద‌రికీ తెలిసినా.. ఇక‌పై జిల్లాగా ఇది రూపుదిద్దుకోనుంది. వాస్త‌వానికి పోల‌వరం గిరిజ‌న ప్రాంతం. అందుకే.. దీనిని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంగా పేర్కొన్నారు. ఆ సామాజిక‌ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేశారు. అయితే.. తాజాగా ఈ ప్రాంతాన్ని కొత్త‌గా జిల్లా చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం ప్రాంతాన్ని పోల‌వ‌రంలో విలీనం చేయ‌డం ద్వారా.. కొత్త జిల్లాగా దీనిని ఏర్పాటు చేయ‌నున్నారు.

వాస్త‌వానికి రంపచోడ‌వ‌రం కూడా ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మే. అయితే.. దీనిని కూడా.. పోల‌వ‌రంలో విలీనం చేయనున్నారు. త‌ద్వారా.. ఎస్టీ ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న సంక‌ల్పం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, పోలవ‌రం ప్రాంతాన్ని ప్ర‌త్యేక జిల్లాగా రూపొందించ‌డానికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు ఉన్నాయి. 1) పోలవరం ముంపు ప్రాంతంలోని అధికశాతం ప్రాంతాలు చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లలో ఉన్నాయి. దీంతో ఇక్క‌డి వారికి పునరావాస ప్రాంతాలు అక్కడే ఏర్పాటవుతున్నాయి.

దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే.. ప్ర‌త్యేకంగా జిల్లా ఏర్పాటు చేయడ‌మే బెట‌ర్ అని సీఎం భావించారు. ఇక‌, కొత్త‌గా పోల‌వ‌రం జిల్లాను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. పొరుగున ఉన్న అల్లూరి సీతా రామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు ఇక్క‌డివారు వెళ్లి ప‌నులు చేయించుకోవాల్సిన అవ‌స‌రం త‌ప్ప నుంది. అదేస‌మ‌యంలో గిరిజన ప్రాంతంలో కొత్త ర‌హ‌దారులు, టెలిక‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌లు అందుబాటులోకి వ‌స్తాయి.

అలానే కొత్త ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, కేంద్రం నుంచి ప్ర‌త్యేకంగా నిధులు తెచ్చుకునేందుకు కూడా అవ కాశం ఉంటుంది. వెనుక‌బ‌డిన జిల్లాల‌తోపాటు.. 2022 నుంచి గిరిజ‌న జిల్లాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నిధులు కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పోల‌వ‌రం అభివృద్ధి చెందేందుకు కీల‌క‌మైన మార్గంగా కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్ర‌బాబు మార్గం సుగ‌మం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై అభ్యంత‌రాలు స్వీక‌రించి.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేయ‌నుంది.

This post was last modified on November 27, 2025 10:27 am

Share
Show comments
Published by
Satya
Tags: Polavaram

Recent Posts

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

5 minutes ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

29 minutes ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

55 minutes ago

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…

2 hours ago

దొంగకే దెబ్బ… ChatGPTతో చుక్కలు చూపించిన కుర్రాడు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…

2 hours ago

సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…

2 hours ago