తెలంగాణ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న బీజేపీ నాయకులకు ఇప్పుడు కొత్త అంశం చేతికి అందింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కమల నాథులకు పెద్దగా విషయాలు దొరకలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, తమ వారిని ఎంగేజ్ చేయడానికి అంశాలు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం బీజేపీకి కలిసివస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఏం జరిగింది
కార్తీక మాసం వచ్చేసరికి అయ్యప్ప భక్తులు, శివ భక్తులు మాల ధారణ చేస్తారు. దీక్షలు స్వీకరిస్తారు. భక్తులతో పాటు ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. పోలీసులు కూడా ఎన్నేళ్లుగా మాల ధరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కొంతమంది బూట్లు వేసుకోకపోయినా యూనిఫాం ధరిస్తారు. దీక్షకు సంబంధించిన కండువాలు మెడలో వేసుకుంటారు.
ఇలాంటి సమయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఒక సర్క్యులర్ జారీ చేశారు. మాల ధారణ చేసే పోలీసులు విధులకు దూరంగా ఉండాలని, సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేశారు. మాల పేరుతో జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, బూట్లు లేకుండా డ్యూటీ చేయడం అనుమతించబోదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే మాలలు ధరించిన అధికారులు ఇరుకాటంలో పడ్డారు. త్వరలో మాల ధారణ చేయాలనుకున్నవారు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక జిల్లా ఎస్పీ ఇటీవల అయ్యప్ప మాల ధారణ చేయడంతో ఆయన్ని సెలవుపై పంపించారు. మరోవైపు ఈ ఆదేశాలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. హిందువుల దేవుళ్లను అవమానించేలా ఈ ఆదేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై బుధవారం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. చర్చించి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 26, 2025 6:23 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…