Political News

వాడివేడిగా మాక్ అసెంబ్లీ.. వారిని మార్షల్స్ ఎత్తి బైటేశారు!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మాక్‌ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్‌, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు.

డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు.

విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దాంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలురకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతిపక్ష వర్గాల మధ్య డిబేట్ జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కొందరిని మార్షల్స్ ఎత్తుకొని బయట వేశారు. అసెంబ్లీని పోలినట్టు వేసిన సెట్ లో ఈ కార్యక్రమం అంతా జరిగింది.

కొంతమంది ప్రజా ప్రతినిధులు గౌరవ సభల్లో ప్రవర్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్టు చూపించిన చిన్నారులు. ఇది చూసి అయినా వాళ్ళు కళ్ళు తెరిచి సభా మర్యాదలు పాటిస్తారేమో చూడాలి.

This post was last modified on November 26, 2025 12:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

6 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

6 hours ago