ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫంక్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొన్నటికి మొన్న వైయస్ జగన్ హైదరాబాదులో కోర్టుకు హాజరైనప్పుడు ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అందులో కేటీఆర్, జగన్ ఫోటోలు కలిపి ప్రదర్శించడం రాజకీ య వర్గాల్లో చర్చ జరిగింది. మొదటినుంచి బీఆర్ఎస్, వైసీపీ పలు అంశాలపై సానుకూలంగా ఉంటున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నపుడు, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నారు. గత తెలంగాణా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇద్దరి మధ్య లోపాయికారీ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి.
ఓటమి తర్వాత అటు కేటీఆర్, ఇటు జగన్ కూడా అధికార పక్షం నుంచి రాజకీయంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిద్దరి ఏమి చర్చ జరిగి ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల కిందట తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ హైదరాబాదులో ఒక ఫంక్షన్ లో ఇటువంటి ఫ్రేమ్ లోనే కనిపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన ఇద్దరు నేతలు ఇలా కనిపించడం కూడా కొంత ఆసక్తిగా మారింది.
వీరి కలయిక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీల వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
This post was last modified on November 22, 2025 10:51 pm
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…