జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న G20 సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేవలం చర్చలతో సరిపెట్టకుండా, ప్రపంచవ్యాప్త అభివృద్ధి కోసం నాలుగు కీలకమైన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. భారతీయ విలువలే ప్రపంచ ప్రగతికి బాటలు వేస్తాయని చెబుతూ.. ఆరోగ్యం, ఉగ్రవాదం, నైపుణ్యాభివృద్ధి, ప్రాచీన విజ్ఞానం అనే నాలుగు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇందులో మొదటిది ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ’. మన తాతముత్తాతల కాలం నాటి విజ్ఞానం, ప్రకృతితో మమేకమై జీవించే పద్ధతులు భవిష్యత్ తరాలకు అందాలనేది మోదీ ఆలోచన. భారతదేశానికి ఈ విషయంలో గొప్ప చరిత్ర ఉంది. ఆ సంప్రదాయ విజ్ఞానాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి, ప్రపంచ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ఉపయోగపడేలా చేయడం ఈ ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం.
ఇక ఆఫ్రికా ఖండం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్’ ద్వారా వచ్చే పదేళ్లలో పది లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. “ట్రైన్ ది ట్రైనర్స్” మోడల్‌లో ఇది సాగుతుంది. వీరు శిక్షణ పొంది, తిరిగి లక్షలాది మంది ఆఫ్రికన్ యువతకు స్కిల్స్ నేర్పిస్తారు. ఆఫ్రికా లాంగ్ టర్మ్ డెవలప్‌మెంట్‌కు ఇది గేమ్ చేంజర్ కానుంది.
కరోనా నేర్పిన పాఠాలతో ఆరోగ్యంపై మోదీ మరో ఐడియా ఇచ్చారు. అదే ‘G20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్’. ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా, ప్రకృతి విపత్తులు సంభవించినా.. వెంటనే స్పందించేలా G20 దేశాల నుంచి వైద్య నిపుణులతో ఒక టీమ్ రెడీగా ఉండాలి. ఇది విపత్తు సమయాల్లో “ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్”లా పనిచేస్తుంది. అందరూ కలిసి పనిచేస్తేనే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోగలమని మోదీ స్పష్టం చేశారు.
చివరిగా, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, ఉగ్రవాదం లింక్‌ను తెంచేందుకు ‘కౌంటర్ డ్రగ్, టెర్రర్ నెక్షస్’ను ప్రతిపాదించారు. ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడం దీని లక్ష్యం. డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాదానికి ఆక్సిజన్‌గా మారుతోంది. అందుకే ఫైనాన్స్, గవర్నెన్స్, సెక్యూరిటీ రంగాలను ఏకం చేసి ఈ ‘డ్రగ్ టెర్రర్ ఎకానమీ’ని దెబ్బకొట్టాలని మోదీ పిలుపునిచ్చారు.
This post was last modified on November 22, 2025 9:23 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…