ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు వరుస సంఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో, తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయారు.
మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నాయని కేస్ షీట్లోనే నమోదు చేసినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నవంబర్ 20న మధ్యాహ్నం పీజీ విద్యార్థిని పాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీనివల్ల పేషెంట్‌కు వెంటనే ఫిట్స్, అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో రాత్రి 10 గంటల సమయంలో ఆమె మరణించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణా లోపం కూడా కారణమని తేలింది.
అలాగే, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల రోగికి అక్టోబర్ 2025 తేదీకి గడువు ముగిసిన మందులు నవంబర్ 8న అక్కడ ఆస్పత్రి వర్గాలు ఇవ్వడంతో… వాటిని వాడిన రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.
This post was last modified on November 22, 2025 6:34 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…