రైతులకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం రాజకీయాల్లో ఉంది. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రాధాన్యం సీఎం చంద్రబాబు అన్నదాతలకు ఇవ్వరని, వారి కష్టాలు పట్టించుకోరని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తారు. రైతు బాంధవులు అంటే వైఎస్ కుటుంబమేనని కూడా చెబుతుంటారు. అయితే దీనికి విరుగుడుగా చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతన్నలను టార్గెట్‌గా చేసుకుని రాజకీయాల్లో దూకుడు పెంచారు.
దీనిలో భాగంగానే టైം ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికి రెండు విడతల్లో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలను నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు అందించారు. ఇక తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వారి కష్టాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ఐదు కీలక సూత్రాలతో పంచ సూత్ర ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు.
ఇటీవల కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ ఐదు సూత్రాలను ప్రకటించారు. వీటివల్ల రైతులకు నష్టాలు రాకుండా మరిన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. పైగా ఎవరో వచ్చి వారి దిగుబడిని కొనుగోలు చేసే వరకు ఎదురు చూడకుండా, రైతులే ముందుకు వచ్చి ప్రత్యక్షంగా విక్రయించుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధంగా పంచ సూత్రాలను చంద్రబాబు ప్లాన్ చేశారు.
అయితే చంద్రబాబు అక్కడితో ఆగలేదు. ఏదో ఒక కార్యక్రమం ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఆ తర్వాత మరింత పక్కాగా ఈ సూత్రాలను అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లి నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా రైతులకు చంద్రబాబుకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేలా పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు.
ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 21, 2025 6:45 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…