Political News

కోట్లు ఇచ్చి 45 కోట్లు తీసుకున్నారా కేటీఆర్?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో అసలు కేసీఆర్‌పై నమోదైన కేసు ఏంటి? ఆయనపై వచ్చిన అభియోగాలు ఏంటనే విషయం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని చర్చ నడుస్తోంది. మరోవైపు గతంలో లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ లైట్ తీసుకున్నా ఏసీబీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఇది లార్జ్ కేసేనని నిపుణులు చెబుతున్నారు.

ఏం జరిగింది?

బీఆర్ ఎస్ హయాంలో ఎన్నికలకు 8 9 నెలల ముందు 2023లో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఇది సాఫీగానే సాగిపోయినా తర్వాత దీనిపై తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. ఈ రేస్‌ను కండక్ట్ చేసిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు 54.88 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఇవి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఖాతా నుంచి అందాయి. అయితే ఇలా ఇవ్వేందుకు హెచ్ ఎండీఏ సమావేశంలో తీర్మానం చేయాలి. అదేవిధంగా ఆర్థిక శాఖ వద్ద అనుమతి పొందాలి.

కానీ అలాంటివేవీ లేకుండా మంత్రి కేటీఆర్ ఒక్క మాట చెప్పగానే ఈ నిధులు 해당 సంస్థకు చేరిపోయాయి. కథ ఇక్కడితో అయితే అసలు పెద్దగా వివాదం ఉండేది కాదు. కానీ ఈ నిధుల నుంచి 45 కోట్ల రూపాయలను కేటీఆర్ ఖాతాలకు ఈవెంట్ స్పాన్సర్ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ బదిలీ చేసింది. దీనిపైనే అసలు కేసు నమోదైంది. అంటే సుమారు 55 కోట్ల రూపాయలను ఇచ్చి దానిలో 45 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల పేరుతో కేటీఆర్ ఖాతాకు బదిలీ చేశారన్నది ఏసీబీ ప్రధాన ఆరోపణ.

సో ఈ ఫార్ములా రేస్ వెనుక భారీ అవినీతి జరిగిందని ఏసీబీ దాఖలు చేసిన కోర్టు పీఎంలో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీయాలంటే మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను విచారించాలని ఏసీబీ భావించింది. దీంతో గవర్నర్‌ను అనుమతి కోరారు. ఇక ఈ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని ఏసీబీ చెబుతోంది. గతంలో 45 కోట్ల రూపాయలను కేటీఆర్ ఖాతాకు మళ్లించిన సంస్థకు 8 కోట్ల జరిమానా విధించిన విషయాన్ని ప్రస్తావించింది.

అదే సమయంలో మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బి. ఎల్. ఎన్. రెడ్డి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వారిని ఇప్పటికే రెండు సార్లు విచారించారు. అదేవిధంగా కేటీఆర్‌ను కూడా ఏసీబీ నాలుగు సార్లు విచారించి అనేక విషయాలను నిర్దారించుకుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే ఈ కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ అభ్యర్థనను ఈ ఏడాది జనవరిలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చాయి. సో మొత్తానికి ఈ కేసులో బలమైన ఆధారాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

This post was last modified on November 20, 2025 9:36 pm

Share
Show comments
Published by
Satya
Tags: KTR

Recent Posts

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

50 minutes ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

54 minutes ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

1 hour ago

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

2 hours ago

లెక్క తప్పిన కలర్ ఫోటో దర్శకుడు

ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…

2 hours ago

అఖండ-2.. హిందీలో పరిస్థితేంటి?

అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…

2 hours ago