Political News

ఇందిర‌మ్మ‌ జ‌యంతి… మ‌హిళ‌ల‌కు రేవంత్ కానుక ఇదే!

నేడు(న‌వంబ‌రు 19) దేశ మాజీ ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ జ‌యంతి. 1917, న‌వంబ‌రులో ఆమె జ‌న్మించారు. దేశానికి ప్ర‌ధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేద‌లను త‌న‌వైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా.. ఇందిర‌మ్మ ప్రజా ప్రాభ‌వం కోల్పోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. దీనికి `ఇందిరా మ‌హిళా శ‌క్తి` అనే పేరు పెట్టింది. ఈ ప‌థ‌కం కింద‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్‌లోని మ‌హిళా మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌ల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. శాంపిల్‌గా కొన్ని చీర‌ల‌ను కూడా ప‌రిశీలించారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ఒకే త‌ర‌హా చీర‌ల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. సీఎం ప‌రిశీలించిన చీర‌ల నాణ్య‌త బాగుంద‌ని.. క్వాలిటీ కూడా నాణ్యంగా ఉంద‌ని కితాబు నిచ్చారు. తెలుపు, నీలం క‌ల‌బోత‌తో ఈ చీర‌ల‌ను ఎంపిక చేయించారు. సిరిసిల్ల స‌హా.. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా.. చీర‌ల‌ను కొనుగోలు చేశారు. కాగా.. రెండు విడ‌త‌లుగా ఇందిరా మ‌హిళా శ‌క్తి పేరిట చీర‌ల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందిరా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 19న తొలిద‌శ పంపిణీ చేయ‌నున్నారు.

ఇది.. డిసెంబరు 8వ తారీకు వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ ద‌శ‌లో అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తారు. కాగా.. ఇదేస‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల్లో పాల‌న‌పై కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్ట‌నున్నారు. అనంత‌రం.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌నేప‌థ్యంలో రెండో ద‌శ‌ను మార్చి వ‌ర‌కు పొడిగించారు. రెండో ద‌శ‌లో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా మార్చి 1 నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తారు. మొత్తంగా కోటి మందికి చీర‌ల‌ను పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం రంగం రెడీ చేసింది.

గ‌తంలో..

గ‌తంలో కేసీఆర్ స‌ర్కారు కూడా బ‌తుక‌మ్మ చీర‌ల పేరిట పేద కుటుంబాల‌కు చీర‌ల‌ను పంపిణీ చేసింది. అయితే.. అప్ప‌ట్లో ఇది వివాదం అయింది. చీర‌ల నాణ్య‌త స‌రిగా లేద‌నిపేర్కొంటూ మ‌హిళ‌లు.. రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. మ‌రికొన్నిచోట్ల అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా.. చీర‌లు గోడౌన్ కూడా దాట‌లేదు. మ‌రోవైపు .. సిరిసిల్ల చేనేత కార్మికుల‌కు.. కేసీఆర్ స‌ర్కారు బ‌కాయి పెట్టింది. ఇది కూడా రాజ‌కీయంగా వివాదానికి దారి తీసింది. అయితే.. మెజారిటీ గ్రామీణుల‌కు మేలు చేసింద‌న్న వాదన కూడా వినిపించింది. కానీ, ఇది గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌కు పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.

This post was last modified on November 19, 2025 5:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

54 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago