Political News

ఎస్సై అరెస్టు: ట‌పాసులు కాల్చి జ‌నం సంబ‌రాలు!

అవినీతి.. అడుగ‌డుగునా చేతులు త‌డ‌పాల్సిందే. పనికావాల‌న్నా.. మాట వినాల‌న్నా.. నోట్ల క‌ట్ట‌లు చేతులు మారాల్సిందే. ఇదీ.. తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో ఉన్న పోలీసు స్టేష‌న్ల‌లో క‌నిపిస్తున్న అవినీతి భూతం. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక వంద‌ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే.. తాజాగా మెద‌క్ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఘ‌ట‌న‌ల‌కు ప‌రాకాష్ఠ‌గా మారింది. అవినీతి అన‌కొండ‌గా మారిన జిల్లాలోని టెక్మాల్ పోలీస్ స్టేషన్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ వేధింపుల‌తో ఆ ప్రాంత వాసులు విసిగిపోయారు. క‌నీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా లంచం రుచి మ‌రిగిపోయార‌న్న ఆవేద‌న తాజాగా బాధితుల నోటి నుంచి వ‌చ్చిందంటే.. స‌ద‌రు ఎస్ ఐ ఏ రేంజ్‌లో అవినీతికి పాల్ప‌డ్డాడో తెలుస్తుంది.

అయితే.. రోజులు అన్నీ ఒకేలా ఉండ‌వు. ఏదో ఒక రోజు ఏసీబీకి ప‌ట్టుబ‌డ‌క త‌ప్ప‌దు. ఈ చిన్న లాజిక్‌ను మ‌రిచిపోయిన ఎస్ ఐ రాజేష్‌.. తాజాగా స్టేష‌న్ లోనే ద‌ర్జాగా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. అయితే.. ఏసీబీ అధికారులు స్టేష‌న్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతోనే గ‌మ‌నించిన రాజేష్‌.. 30 వేల రూపాయ‌ల‌ను గాలిలోకి విసిరేసి.. ఒక్క ఉదుట‌న ప‌రుగు లంఖించుకున్నాడు. స‌మీపంలోని వ్య‌వ‌సాయ పొలాల్లోకి పారిపోయాడు. అయితే.. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఏసీబీ అధికారులు.. స్థానిక యువ‌త సాయంతో పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న‌ను స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చి అరెస్టు చేశారు.

ఓ కేసులో ఫిర్యాదు తీసుకునేందుకు.. కేసున‌మోదు చేసుకునేందుకు ఓ వ్య‌క్తి నుంచి రూ.50 వేలు లంచం కోర‌గా.. స‌ద‌రు వ్య‌క్తి 30 వేల‌కు బేరం కుదుర్చుకున్నాడు. అయితే.. ఆ వెంట‌నే అవినీతి ఎస్సై ఉదంతాన్ని ఏసీబీకి కూడా ఉప్పందించారు. దీంతో ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు స్టేష‌న్‌లో నే కూర్చుని 30 వేల రూపాయ‌ల లంచం సొమ్మును తీసుకుంటుండ‌గా ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. వీరివిష‌యాన్ని గ్ర‌హించిన ఎస్ ఐ వెంట‌నే ప‌రుగు పెట్టి స‌మీపంలోని పొలాల్లోకి పారిపోయాడు. కాగా.. అరెస్టు చేసిన ఎస్సైపై గ‌తంలోనూ ప‌లు స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ఏసీబీ అధికారులు తెలిపారు.

పీడ విర‌గ‌డైంది: స్థానికులు..

ఎస్ ఐ రాజేష్ అరెస్టుతో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నిజానికి దీపావ‌ళి పండుగ ఇప్పుడే త‌మ‌కు వ‌చ్చింద‌ని కూడా వ్యాఖ్యానించారు. ఏ చిన్న కేసుపై స్టేష‌న్‌కు వెళ్లినా.. త‌మ‌ను పురుగుల్లా చూశాడ‌ని.. రూపాయి ముడితేనే ప‌నులు చేసేవాడ‌ని చెప్పారు. దీంతో స్థానికులు కొంద‌రు స్టేష‌న్ ముందే ట‌పాసులు కాల్చి సంబ‌రాలు చేసుకున్నారు. కొంద‌రు మిఠాయిలు కూడా పంచుకున్నారు. అయితే.. వ్య‌వ‌స్థీకృత లోపం, పోలీసులు అంటే.. అధికార పెత్త‌నం కోస‌మే వ‌చ్చామ‌న్న అభిప్రాయం మెండుగా స్థిర‌ప‌డిపోయిన నేప‌థ్యంలోనే ఇలాంటి అధికారులు అవినీతి బాట ప‌డుతున్నార‌ని కొంద‌రు తెలిపారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో దృష్టి పెట్టి స్టేష‌న్ల‌ను సంస్క‌రించాల‌ని చెబుతున్నారు.

This post was last modified on November 19, 2025 5:03 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

13 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

32 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

36 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago