Political News

నిన్న రీన్యూ.. నేడు బ్రూక్ ఫీల్డ్.. తగ్గేదెలే!

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రూ.లక్షా 10 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. వైసీపీ హయంలో తిరిగి వెళ్ళిపోయిన రిన్యూ కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందంటూ నిన్న లోకేష్ బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు. ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్లు (₹1.1 లక్ష కోట్ల) పెట్టుబడులకు ముందుకు వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇది మరో భారీ పెట్టుబడి అని ప్రకటించారు.

ఈ పెట్టుబడులు పునరుత్పత్తి శక్తి, బ్యాటరీ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సౌర తయారీ రంగంతో పాటు వివిధ డీకార్బనైజేషన్ కార్యక్రమాల్లో వినియోగిస్తారని తెలిపారు. అదనంగా బ్రూక్‌ఫీల్డ్ సంస్థ డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, మౌలిక వసతులు, పోర్టులు వంటి విభిన్న రంగాలలో కూడా భాగస్వామ్యం కానుందని ఆయన వెల్లడించారు. ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను స్థిరమైన, మార్పును నడిపించే పెట్టుబడుల గ్లోబల్ హబ్‌గా మరింతగా నిలబెట్టే అవకాశం ఉందని లోకేష్ ప్రకటించారు.

ఇదే కాదు నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి మరో డేటా సెంటర్ వచ్చింది. విశాఖపట్నంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో అమెరికాకు చెందిన టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 300 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఐదేళ్ల జగన్ హయాంలో ఎస్ఐపిబి సమావేశాలు చాలా అరుదుగా జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడాదికాలంలో 12 సమావేశాలు జరిగాయి. అంటే దాదాపుగా నెలకి ఒక సమావేశం జరిగింది. అంటే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు భారీ పెట్టుబడులు రావడానికి కారణం అవుతుంది.

This post was last modified on November 14, 2025 10:13 am

Share

Recent Posts

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

1 hour ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

2 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

2 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

2 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

4 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

8 hours ago