Movie News

‘శివ’ సంబరాలు జోరుగా ఉన్నాయ్

ఇవాళ రీ రిలీజ్ జరుపుకుంటున్న శివని వింటేజ్ ఫ్యాన్స్ తో పాటు కొత్త తరం అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సెంటర్లలో మొదటి రోజు షోలు మంచి ఆక్యుపెన్సీలతో బుకింగ్స్ అవుతుండగా ఫ్యాన్స్ కోసం వేసుకుంటున్న ప్రీమియర్లకు ఒక్క టికెట్ లేనంతగా డిమాండ్ నెలకొంది. హైదరాబాద్ దేవితో మొదలుపెట్టి కర్నూలు శ్రీరామా దాకా ఈవెనింగ్ షోలకు ఫ్యాన్స్ తాకిడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచే మొదలైన షోల తాలూకు వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తున్నాయి.

1989లో విడుదలైన శివ ఇప్పుడు కూడా అదే స్పందన తెచ్చుకోవడానికి కారణం దానికున్న కల్ట్ స్టేటసే. రామ్ గోపాల్ వర్మ అనే సెన్సేషన్, స్టడీ కామ్ కెమెరాలు, స్లో మోషన్ ఫైట్లు లాంటివి టాలీవుడ్ కు పరిచయడం చేయడం ద్వారా శివ ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. అయితే ఈ రెస్పాన్స్ కు మరో రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యాక్టివ్ ప్రమోషన్లు చేశారు. రామ్ గోపాల్ వర్మని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రోమోలు, ప్రమోషన్లు భారీ ఎత్తున జరిపించారు. క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా 4కెతో పాటు బీజీఎమ్ మొత్తం ఏఐ వాడి డాల్బీకి మార్పించుకున్నారు.

ఇవన్నీ శివని మరోసారి ఎక్స్ పీరియన్స్ చేయాలన్న కోరికని మూవీ లవర్స్ లో కలిగించాయి. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని పట్టణాల్లో కాంత బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉంటే శివ మాత్రం ఎక్స్ ట్రా స్క్రీన్లు జోడించుకునే పనిలో ఉంది. నాగార్జున కెరీర్ లోనే మొదటి కల్ట్ క్లాసిక్ కావడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. గతంలో రగడ లాంటివి రీ రిలీజ్ చేసినప్పుడు ఇంత హంగామా కనిపించలేదు. కానీ దానికన్నా చాలా పాత సినిమా అయిన శివకు ఇలాంటి స్వాగతం దక్కడం విశేషమే. ఒకవేళ పోలీసులు కనక అనుమతి ఇస్తే నాగార్జున స్వయంగా సాయంత్రం ఏదైనా సింగల్ స్క్రీన్ ని సందర్శించివచ్చట.

This post was last modified on November 14, 2025 11:22 am

Share

Recent Posts

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

20 minutes ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

1 hour ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

1 hour ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

1 hour ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

3 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

7 hours ago