తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డికి ఈరోజు నోటీసులు ఇచ్చింది. ఈనెల 13వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ నిజమని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ బృందం తేల్చింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో లడ్డూ తయారీకి బోలే బాబా డెయిరీ నుంచి సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో తయారు చేసిందని దర్యాప్తు బృందం తేల్చింది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అని 2024 ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వేళ్లు వైసీపీ హయాం నాటి టిటిడి చైర్మన్లు గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైపు చూపించాయి.
ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టీ చంద్రబాబు గారు టీటీడీ ప్రతిష్ట మంట గలుపుతున్నారు అని అటువంటి కల్తీ కి ఆస్కారం లేదు అని ప్రకటించారు. తమ చిన్నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని.. ఆయన ” సూపర్ స్వామి” అని తన చిన్నాన్నను సమర్థించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడం వైసీపీలో కలకలం రేగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates