Political News

దేశ రాజ‌ధానిలో భారీ పేలుడు… 8 మంది మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో భారీ పేలుడు సంభ‌వించింది. కీల‌క‌మైన ప‌ర్య‌టక ప్రాంతం ఎర్ర‌కోట వ‌ద్ద ఉన్న మెట్రో రైల్వే స్టేష‌న్ గేటు 1 ద‌గ్గ‌ర పార్క్ చేసి ఉంచిన కారులో జ‌రిగిన ఈ పేలుడు రాజ‌ధానిని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లు కార్లు కాలి పోగా.. 8 మంది మృతి చెందిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశామ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి.. మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఈ పేలుడు కార‌ణాల‌పై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని.. అనుమానుత‌ల‌ను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని పోలీసులు తెలిపారు.

కాగా.. ఘ‌ట‌నా ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పేలుడు ధాటికి భారీగా శ‌బ్దాలు వ‌చ్చాయ‌ని స్థానికులు తెలిపారు. స‌మీపంలోని ప‌లు ఇళ్లలో గోడ‌లు, వ‌స్తువులు కూడా ధ్వంస‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఇక‌, ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో బైకులు, కార్లు మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఇక‌, ఈ ఘ‌ట‌న అనంత‌రం.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు భీతిల్లారు. ప్ర‌జ‌లు ప‌రుగులు పెట్టిన దృశ్యా లు సీసీ కెమెరాల్లో న‌మోద‌య్యాయి. అయితే.. చిత్రం ఏంటంటే ప్ర‌తి సోమ‌వారం రాజ‌ధానిలో ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో తాజాగా పేలుడు జ‌రిగిన రోజు సోమ‌వారం కావ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింద‌ని పోలీసులుచెబుతున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెంద‌గా.. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

అనేక అనుమానాలు!

రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. ఇది కుట్ర పూరితంగా జ‌రిగిందా? లేక‌.. ఉగ్ర‌వాద కోణం ఉందా? అనే దిశ‌గా పోలీసులు దృష్టి పెట్టారు. సోమ‌వారం ఉద‌యం నుంచి మెట్రో రైల్వే స్టేష‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎవ‌రు సంచ‌రించారు, ముసుగులు ధ‌రించిన వారు ఉన్నారా?  లేక‌.. ఎవ‌రైనా ఉద్దేశ పూర్వకంగా చేశారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, మ‌రో రీజ‌న్‌పై కూడా దృష్టి పెట్టారు. కారులో పేలుడు ప‌దార్థాలు ఉంచి.. దూరంగా ఎవ‌రైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తుచేస్తున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర‌ప‌తి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఢిల్లీసీఎం రేఖా గుప్తా.. ఈ ఘ‌ట‌న‌పై ప‌ర్య‌వేక్షించారు.

This post was last modified on November 10, 2025 9:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

8 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

1 hour ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

4 hours ago