చుట్టూతా అడవి.. పక్కనే సెలయేరు.. ఒక బండరాయిపై కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పుస్తకం పట్టుకొని సీరియస్ గా చదువుతున్నారు.. సోషల్ మీడియాలో దీనిని చూసిన ఆయన అభిమానులు, జనసైనికులు.. ఆ పుస్తకం పేరు ఏంటని ఆసక్తిగా గమనించారు. మరికొందరైతే ఆ పుస్తకం పైన టైటిల్ ని చూసి గూగుల్ సెర్చ్ చేశారు. కెన్నెత్ ఆండర్సన్ రాసిన మాన్ ఈటర్స్ జంగిల్ కిల్లర్స్ పుస్తకం అది..! ఆ పుస్తకంలో ఏముంది అనే ఆసక్తి సహజంగానే అందరికీ కలిగింది.
1910- 1974 మధ్య కాలంలో జీవించిన కెన్నెత్ ఆండర్సన్ భారతదేశానికి చెందిన స్కాట్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు, అధికారి. బెంగళూరులో నివాసముంటూ భారతదేశపు అడవులలో సంచరించే పులులు, చిరుతపులులు, ఏనుగులు అడవి కుక్కలు, పాములు, ఎలుగుబంట్లు మొదలైన వన్యమృగాల గురించి ఆసక్తికరమైన ఎన్నో పుస్తకాలు, రచనలు చేశారు. ఈ పుస్తకంలో మనుషులను చంపే మృగాలను నిర్మూలించాలని పిలుపుని అందుకున్న వేటగాడు ఎలా తన సవాలను స్వీకరిస్తాడు… ఇందులోని వేటగాడి క్యారెక్టర్ ద్వారా అడుగు అడుగుగా తన అనుభవాలను వివరించి, తన వేట విధానాన్ని, అందులో దాగి ఉన్న భయం మరియు ఉత్కంఠను పాఠకుడి ముందు ఉంచాడు ఆండర్సన్.
పవన్ కళ్యాణ్ కు సహజంగా పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఆసక్తి. మరి ఇతర రాజకీయ నాయకుడికి లేని అలవాటు ఇది. ఈ ఏడాది విజయవాడలో జరిగిన 35వ పుస్తక మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇటీవల లక్ష్మి ముర్డేశ్వర్ పురి రచించిన “ఆమె సూర్యుడిని కబళించింది” పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పలు ప్రసంగాల్లో ఆయన పుస్తకాల్లోని వాక్యాలను ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదవడంతో సహజంగానే అందరికీ ఆ పుస్తకంపై ఆసక్తి కలిగింది.
This post was last modified on November 9, 2025 7:40 pm
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…