హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కవిత మాట్లాడుతూ, “ఉరి శిక్ష విధించే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. ఇది చాలా బాధాకరం” అని అన్నారు. ఇంకా ఆమె స్పష్టం చేస్తూ, “కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను. కానీ బీఆర్ఎస్‌తో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పింది.
తన సస్పెన్షన్‌పై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత పరిస్థితులను మరింత కష్టతరం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కవిత మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బలుగా మారుతున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీలో ఇప్పటికే ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కుటుంబ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు దిశ గురించి చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి.
This post was last modified on November 9, 2025 11:15 am
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…