Political News

కేటీఆర్‌ను అరెస్టు చేద్దామంటే.. : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేద్దామంటే గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ఇవ్వ‌డంలేద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా అవినీతి మ‌య‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై సీబీఐ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని.. దీనిని సీబీఐకి కూడా అప్ప‌గించామ‌న్నారు. కానీ, మూడు మాసాలైనా ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐ రంగంలోకి దిగ‌లేద‌ని తెలిపారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతోంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఆరోపించారు. బీజేపీ, కారు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం-సంబంధం లేక‌పోతే.. ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.

త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంద‌ని మ‌రోసంచ‌ల‌న వ్యాఖ్య చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విష‌యాన్ని గ‌తంలో అదే పార్టీకి చెందిన క‌విత కూడా చెప్పార‌న్నారు. విలీన ప్ర‌క్రియ ప్ర‌తిపాద‌న‌ను తానే అడ్డుకున్న‌ట్టు ఆమె చెప్పిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలో ఇరు పార్టీలు క‌లిసి.. ప్ర‌యోగం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేన‌ని సీఎం చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు అండ‌గా ఉంటున్నార‌ని తెలిపారు.

మైనారిటీలు, క్రిస్టియ‌న్ వ‌ర్గాలు కూడా త‌మ‌కే అనుకూలంగా ఉన్నార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీ మైనారిటీల‌కు అండ‌గా ఉన్నార‌ని తెలిపారు. వారంతా కాంగ్రెస్‌తోనే ఉన్నార‌ని పేర్కొన్నారు. అదేవిధంగా క్రిస్టియ‌న్లు కూడా త‌మ‌తోనే ఉన్నార‌ని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో వారి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలిపారు. బీఆర్ ఎస్‌-బీజేపీలు ఆడుతున్న నాట‌కాల‌ను.. క‌ల‌సి చేస్తున్న విన్యాసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్న రేవంత్ రెడ్డి..త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పోలింగ్‌లో ఇరు పార్టీల‌కు బుద్ది చెబుతార‌ని అన్నారు.

కిష‌న్ రెడ్డి మ‌రోమాట‌..

మ‌రోవైపు బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క‌వ‌ల పిల్ల‌ల‌ని.. అవి రెండూ క‌లిసే ప‌నిచేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీకి-బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నా రు. పైగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. కేసీఆర్ మంత్రిగా ప‌నిచేశార‌ని.. తెలంగాణ వ‌చ్చాక కుటుంబంతో స‌హా క‌లిసి వెళ్లి సోనియాగాంధీని ప్ర‌శంసించార‌ని గుర్తు చేశారు. కాబ‌ట్టి.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే అవ‌గాహ‌నా ఒప్పందం ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 6, 2025 6:23 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

33 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago