ఏపీ లోని ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈనెల 27నుంచి డిసెంబర్ 2వతేదీ వరకు వారంరోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలి, అక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు మనం ఏం చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్, సింగపూర్‌లలో అధ్యయనానికి పంపించాలని గతంలో ఆయన సీఎం చంద్రబాబును కోరారు. ఇది కార్యరూపం దాల్చింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు 100 మంది నిన్న విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వీరంతా అక్కడ నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్కల్చర్‌ను సందర్శిస్తారు. రెండు రోజుల టూర్‌లో భాగంగా వారికి సైన్స్, టెక్నాలజీల మీద ప్రాక్టికల్ అవగాహన పెరగనుందని అధికారులు చెబుతున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ విద్యా యాత్ర ద్వారా విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలపై ప్రాయోగిక అవగాహన పెంపొందించుకునే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులందరూ సురక్షితంగా ప్రయాణం చేయాలని, ఈ యాత్ర ద్వారా కొత్త జ్ఞానం, అనుభవాలు సంపాదించి తిరిగి రావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
This post was last modified on November 5, 2025 9:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…