ఔను.. నిజం.. ఆదివారం అర్ధరాత్రి(తెల్లవారితే సోమవారం) వరకు ప్రముఖుల నుంచి పిల్లల వరకు అంద రికీ కంటిపై కునుకులేదంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కారణం.. నవీముంబై వేదిగా.. జరిగిన ఉమెన్.. వన్ డే ప్రపంచ క్రికెట్!. నిజానికి ఇప్పటి వరకు పురుషుల క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తో పోలిస్తే.. మహిళా క్రికెటర్లకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒకప్పుడు అసలు చర్చ కూడా ఉండేది కాదు. కానీ, గత రెండుసార్లు.. మన హైదరాబాదీ క్రీడాకారిణి మిథాలీరాజ్.. చేసిన సాహసం కారణంగా..దేశీయంగా మహిళా క్రికెట్‌కు.. క్రికెటర్లకు కూడా ఆదరణ పెరిగింది.
దీంతో ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ ఉమెన్ టీంల మధ్య పోరు ఉత్కంఠకు గురి చేసింది. జియో హాట్ స్టార్‌లో లైవ్ ప్రసారం అయిన.. ఈ మ్యాచ్‌ను లైవ్‌లోనే సుమారు 27 కోట్ల మంది వీక్షించారు. ఇక.. ఇతర మాధ్యమాల్లో వీక్షించిన వారి సంఖ్య కూడా ఇంతకు మించి ఎక్కువే ఉంటుందని క్రీడా పండితులు తెలిపారు. దీనికి కారణం.. సాధారణంగా.. రాత్రం 9 గంటల వరకు కూడా భారత్ టీం బ్యాటింగ్ చేసింది. అయితే…పెద్దగా స్కోరు దక్కించుకునే దశలో ఉన్నారని అనుకున్న క్షణంలో విజృంభించింది.
దీంతో ఏకబిగి స్కోరు 298 పరుగులకు చేరింది. అటు వైపు చూస్తే.. దక్షిణాఫ్రికా జట్టు.. మంచి ఢక్కాముక్కీ లు తిన్న జట్టు కావడంతో అప్పటి నుంచి ఉత్కంఠ రేగింది. చివరకు 12.10 నిమిషాల సమయంలో లాస్ట్ బాల్ పడే వరకు.. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా ఈ క్రీడను వీక్షించినట్టు లెక్కులు చెబుతున్నాయి. అదేసమయంలో చివరిగా కప్‌ను అందుకుని.. గ్రూప్ ఫొటోలుదిగేవరకు కూడా.. టీవీలకు అతుక్కు పోయారు. ఈ జాబితాలో సాధారణ క్రికెట్ అభిమానులే కాదు.. ప్రధానుల నుంచి ముఖ్యమంత్రుల వరకు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా(ఐసీసీ చైర్మన్ జైషాకు తండ్రి), జేపీ నడ్డా, కిషన్ రెడ్డి.. సహా.. రాష్ట్రాలకు వస్తే.. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నుంచి మంత్రుల వరకు.. ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇతర మంత్రుల దాకా.. అందరూ.. మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు మాత్రమే కాదు.. వారు ఆడిన తీరును, విజయాన్ని దక్కించుకున్న తీరును కూడా అభివర్ణిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేయడం గమనార్హం. అందుకే.. అర్ధరాత్రి దాటే వరకు దేశానికి నిద్రపట్టలేదు!!.
This post was last modified on November 3, 2025 11:11 am
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…