Political News

పీకే మ‌ద్ద‌తు దారు హ‌త్య, మారిన రాజ‌కీయం

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో వారం రోజుల్లో తెర‌ప‌డ‌నుంద‌న‌గా.. తీవ్ర‌సంచ‌ల‌న ఘ‌ట‌న చో టు చేసుకుంది. ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. అంతో ఇంతో ప్ర‌శాంతంగానే పార్టీల‌ ప్ర‌చా రాలు సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో వారంలోనే ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డి ప్ర‌జ‌లు కొత్త ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిశోర్ మ‌ద్ద‌తు దారు.. ఆ పార్టీ అభ్య‌ర్థి బంధువు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

అది కూడా.. ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. వేల మంది ప్ర‌జ‌లు హాజ‌రైన స‌మ‌యంలో శనివారం సాయంత్రం గుంపుగా వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తులు.. జ‌న్ సురాజ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఈ క్ర‌మంలో ఒక‌రు.. తుపాకీతో కాల్పుల‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌లో మొకామా నియోజ‌క‌వ‌ర్గం జ‌న్ సురాజ్ పార్టీ అభ్య‌ర్థి పీయూష్ ప్రియ‌ద‌ర్శి సొంత మామ‌గారు, పీకేకు స‌ల‌హాదారుగా, పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్న దులార్ చంద్ కు తూటా త‌గిలింది. ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల‌ను అరెస్టు చేయ‌గా.. మూలాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇదే మొకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న అధికార జేడీయూ అభ్య‌ర్థి అనంత్ సింగ్ హ‌స్తం ఉంద‌ని పోలీసులు గుర్తించారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను ఆదివారం తెల్ల‌వారు జామున అరెస్టు చేశారు. త‌న‌కు పోటీ ఇస్తున్నందునే.. ఈ కాల్పులు జ‌రిపించిన‌ట్టు సింగ్ పోలీసులు తెలిపార‌ని స‌మాచారం.

రాజ‌కీయం యూట‌ర్న్‌..

తాజాగా జ‌రిపిన కాల్పుల ఘ‌ట‌న‌తో ఇప్ప‌టి వ‌ర‌కు.. ఉన్న రాజ‌కీయ ప్ర‌చారంలో యూట‌ర్న్ చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జంగిల్ రాజ్ అంటూ.. ఆర్జేడీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న జేడీయూ, బీజేపీల‌ను కార్న‌ర్ చేస్తూ.. కాంగ్రెస్‌, ఆర్జేడీ స‌హా ప్ర‌శాంత్ కిశోర్ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. తాజా హ‌త్య ఘ‌ట‌న అనంత‌రం.. ఎన్నిక‌ల సంఘం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కాగా, వ‌చ్చే నెల 9, 11 న రెండు ద‌శ‌ల్లో బీహార్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

This post was last modified on November 2, 2025 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

56 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago