ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, చంద్రబాబు కుటుంబ సభ్యులపై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అయినా సరే, తన వ్యాఖ్యలపై జోగి రమేష్ ఏనాడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జోగి రమేష్ తన తప్పు ఒప్పుకున్నారు.
ఆనాడు చంద్రబాబు గురించి, ఆయన కుటుంబం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ జోగి రమేష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల గురించి తన భార్య తనను అడిగిందని, ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలు తప్పని తాను రియలైజ్ అయ్యానని జోగి రిగ్రెట్ అయ్యారు. అయితే, తాను ప్రమాణం కోసం అడిగానని, వారి కుటుంబాల జోలికి తాను వెళ్లలేదని అన్నారు.
వారి కుటుంబాలను తాను ఎప్పుడూ కించపరచలేదని, కించపరచబోనని చెప్పారు. రాజకీయపరంగా తాను విమర్శలు చేస్తానని, పొలిటికల్ పొలిటికలేనని…కుటుంబాల జోలికి వెళ్లనని చెప్పుకొచ్చారు. అయితే, ఇటీవల కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పై తీవ్ర ఆరోపణలు రావడంతోనే ఆయన ఈ రకంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. నిజంగానే జోగి రిగ్రెట్ అయితే మంచిదేనని, జోగి బాటలో చాలామంది ఇంకా జ్ఞానోదయం కావాల్సి ఉందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates