టీడీపీ సీనియర్ నాయకుడు, హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు అందుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఉంది. ఈ విషయంలో తేడా లేదు. నందమూరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి అభిమానుల వరకు బాలయ్యను సమర్థిస్తారు. ఆయన కొన్ని సందర్భాల్లో అభిమానులపై చేయిచేసుకున్నారు. అయినా, ఆయన విషయంలో అభిమానులు పాజిటివ్‌గా ఉన్నారు. ఇలాంటివారు వైసీపీలో కూడా ఉన్నారు.
అయితే, తాజాగా మాజీ సీఎంవైసీపీ అధినేత జగన్ బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీ డియాతో మాట్లాడిన జగన్, గత నెలలో ఏపీ అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. అనంతరం, జగన్ స్పందిస్తూ, అసెంబ్లీ బాలకృష్ణ మందు తాగి వచ్చాడని అన్నారు.
బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారు? బాలకృష్ణ పనీపాటలేని సంభాషణలు చేశారు. అని తెలిపారు.
అంతేకాదు, అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడిందేంటి? అని జగన్ ప్రశ్నించారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అని జగన్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలకృష్ణను విమర్శించడం తప్పుకాదని, ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పవచ్చని అంటున్నారు. కానీ, బాలయ్యను వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల పార్టీకి నష్టం అని చెబుతున్నారు.
పైగా, ఎలాంటి ఆధారాలు లేకుండా, బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడని ఎలా వ్యాఖ్యానిస్తారన్నది రాజకీయ వర్గాల్లో కూడా జగన్‌పై చర్చ సాగుతోంది. బాలయ్య ఎప్పుడు మాట్లాడినా అలానే ఉంటుందని, ఆయన వ్యవహార శైలే అలాంటిదని కొందరు చెబుతున్నారు.
గమనించదగ్గ విషయం, గత అసెంబ్లీ సమావేశాల్లో జగన్‌ను సైకో అని బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీని కారణంగా పలు వైసీపీ నాయకులు అప్పట్లోనే బాలయ్యపై విరుచుకుపడ్డారు.
This post was last modified on October 23, 2025 8:46 pm
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…