Political News

18 ల‌క్ష‌లు- 12 ఎక‌రాలు: ఆ కుటుంబానికి చంద్ర‌బాబు సాయం!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న దార‌గానిపాడు గ్రామంలో జ‌రిగిన దారుణ హ‌త్య పై సీఎం చంద్ర‌బాబు ఉదారంగా స్పందించారు. ఈ నెల 2న జ‌రిగిన ఘ‌ట‌న‌లో ల‌క్ష్మీనాయుడు అనే వ్య‌క్తిని టీడీపీకి చెందిన హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తి కారుతో గుద్దించి సినీ ఫ‌క్కీలో దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచల‌నం సృష్టించింది. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌కు కులం రంగు కూడా పులుముకుంది.

ఈ నేప‌థ్యంలో దీపావ‌ళికి ముందు రోజు హుటాహుటిన ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన సీఎం చంద్ర‌బాబు మంత్రులు నారాయ‌ణ‌, అనిత‌ల‌ను క్షేత్ర‌స్థాయికి పంపించి.. ల‌క్ష్మీనాయుడి కుటుంబంతో మాట్లాడించారు. తాను కూడా స్వ‌యంగా ఫోన్ చేసి ఆ కుటుంబానికి భ‌రోసా క‌ల్పించారు. దోషులు ఎంత‌టి వారైన క‌ఠినంగా శిక్షించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి.. ఈ కేసును త్వ‌ర‌గా విచారించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా అప్ప‌ట్లోనే ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.

తాజాగా ఈ విష‌యంపై ద‌గ్గ‌ర‌లో ఉన్న మంత్రులు, అధికారుల‌తో సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయ‌డంపై దృష్టి పెట్టారు. వ్య‌వ‌సాయ కుటుంబం కావ‌డంతో దానికి సంబంధించి నస‌హ‌కారం అందించాల‌ని నిర్ణ‌యించారు. ఒక ద‌శ‌లో ల‌క్ష్మీనాయుడు భార్య సుజాత‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని భావించినా.. ఆమె వ్య‌వ‌సాయం చేసుకునేందుకే మొగ్గు చూపిన‌ట్టు అధికారులు వివ‌రించారు. దీంతో వ్య‌వ‌సాయ భూమితో పాటు ప‌రిహారం ప్ర‌కటించారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన ల‌క్ష్మీనాయుడు సోద‌రులు ప‌వ‌న్‌, భార్గ‌వ్‌ల‌కు కూడా ప‌రిహారం ప్ర‌క‌టించారు.

ప‌రిహారం ఇలా..

+  ల‌క్ష్మీనాయుడి భార్య సుజాత‌కు:  4 ఎక‌రాల పొలం-5 ల‌క్ష‌ల రూపాయ‌లు.
+  ల‌క్ష్మీనాయుడి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు:  4 ఎక‌రాల పొలం-5 ల‌క్ష‌ల రూపాయ‌లు(ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు)
+ ల‌క్ష్మీనాయుడి సోద‌రుడు ప‌వ‌న్‌కు:  4 ఎక‌రాల పొలం-5 ల‌క్ష‌ల రూపాయ‌లు.
+ ల‌క్ష్మీనాయుడి మ‌రో సోద‌రుడు భార్గ‌వ్‌కు : 3 ల‌క్ష‌ల రూపాయ‌లు.

This post was last modified on October 21, 2025 9:49 pm

Share

Recent Posts

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

1 hour ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

4 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

8 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

8 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

11 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

13 hours ago