Political News

ఏవండీ.. జాగ్ర‌త్త‌: బాబుకు భువ‌నేశ్వ‌రి, జ‌గ‌న్‌కు భార‌తి జాగ్ర‌త్త‌లు!

ఏపీ ముఖ్య‌మంత్రిగా నిత్యం బిజీగా ఉంటున్న చంద్ర‌బాబు, విప‌క్ష(ప్ర‌ధాన కాదు) నేత‌గా, మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దీపావ‌ళి వేళ స‌తీమ‌ణుల‌తో క‌లిసి పండుగను ఘ‌నంగా జ‌రుపుకొన్నారు. అయితే.. ఇరువురు క‌లిసికాదు.. వేర్వేరుగానే సుమా!. చంద్ర‌బాబు త‌న సతీమ‌ణి భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి బెంగ‌ళూరులోని నివాసంలో దీపావ‌ళి పండుగ‌ను నిర్వ‌హించుకున్నారు.

ఇక‌, సీఎం చంద్ర‌బాబు పండుగైనా.. మ‌రే కార్య‌క్ర‌మ‌మైనా.. పార్టీ జెండా రంగు లైట్ ప‌సుపు వ‌ర్ణంలోని చొక్కాను ధ‌రించ‌గా.. ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి మాత్రం ప‌ట్టుచీర ధ‌రించారు. ఇక‌, జ‌గ‌న్ వైట్ ష‌ర్టే ధ‌రించినా.. కాస్త భిన్నంగా లాల్చీ టైపులో కుట్టించుకున్నారు. బ్లాక్ క‌ల‌ర్ ఫ్యాంటు, షూస్ ధ‌రించారు. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి వంగ‌పండు రంగు పంజాబీ డ్ర‌స్ ధరించారు. ఇలా.. దీపావ‌ళి వేళ ఇరు కుటుంబాలు సంతోషంగా పండుగ‌ను నిర్వ‌హించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా.. చంద్ర‌బాబు స‌తీమ‌ణి, జ‌గ‌న్ స‌తీమ‌ణి.. ఇద్ద‌రూ త‌మ త‌మ భ‌ర్త‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెప్ప‌డం విశేషం. చంద్ర‌బాబు చిచ్చుబుడ్డి వెలిగిస్తుండ‌గా.. వెనుకాల ఉన్న భువ‌నేశ్వ‌రి… `ఏవండీ జాగ్ర‌త్త‌` అంటూ .. జాగ్ర‌త్త‌లు చెప్పారు. “ఆ..“  అని ఓ న‌వ్వు న‌వ్విన చంద్ర‌బాబు.. ధైర్యంగా ముందుకు సాగి.. చిచ్చుబుడ్డే కాదు.. సీమ ట‌పాకాయ‌లు కూడా వెలిగించారు. ఇక‌, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి కాక‌ర‌పువ్వ‌త్తుల‌కు ప‌రిమితం కాగా.. జ‌గ‌న్ త‌న‌కు ఇష్ట‌మైన తారాజువ్వ‌ల‌ను వ‌డుపుగా నింగిలోకి పంపించారు.

గ‌త సంవ‌త్సరం ఇరు కుటుంబాలు దీపావ‌ళికి దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్ర‌బాబు.. పొదుపు పేరుతో ఈ పండుగ‌కు దూరంగా ఉన్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఓట‌మి బాధ‌తో పండుగ‌ను నిర్వ‌హించుకోకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక ఇరు కుటుంబాల్లోని పిల్ల‌లు తాజా పండుగ‌లోనూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నారా లోకేష్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా, జ‌గ‌న్ పిల్ల‌లు ఇద్ద‌రూ లండ‌న్‌లోనే ఉన్నారు. దీంతో దంప‌తులే దీపావ‌ళిని నిర్వ‌హించుకున్నారు.

This post was last modified on October 20, 2025 10:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago