Political News

అన్న‌మాట నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు.. ఏం చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్న‌మాట నిల‌బెట్టుకున్నారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల సంఘాల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి డిమాండ్ల‌లో కొన్నింటికి అప్ప‌టిక‌ప్పుడు హామీ ఇచ్చారు. వీటిలో ప్ర‌ధానంగా క‌రువు భ‌త్యం(డీఏ) త‌క్ష‌ణ‌మే అమ‌లు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సుమారు 2 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. అయిన‌ప్ప‌టికీ సీఎం చంద్ర‌బాబు వారికి హామీ ఇచ్చారు. ఈ హామీని అమ‌లు చేస్తూ.. తాజాగా స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు స‌ర్కారు దీపావ‌ళి కానుక ప్ర‌క‌టించింది. ఉద్యోగులు, పెన్ష‌నర్ల‌కు సంబంధించిన క‌రువు భ‌త్యం.. డీఏను పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. 3.64 శాతం చొప్పున డీఏను పెంచుతున్న‌ట్టు తెలిపింది. ఇది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న 33.67 శాతం డీఏ జ‌న‌వ‌రి నుంచి 37.31 శాతానికి పెర‌గ‌నుంది. ఈ పెంచిన మొత్తాన్ని జ‌న‌వ‌రి నెల వేత‌నం నుంచి ఉద్యోగుల‌కు అందించ‌నున్నారు. ఈ మేర‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన మాట‌ను కూడా సీఎం చంద్ర‌బాబు నిల‌బెట్టుకున్నారు. సుదీర్ఘ కాలంగా ప్ర‌మోష‌న్ల‌కు నోచుకోక‌పోవ‌డంపై ఉద్యోగులు ఆందోళ‌న‌లో ఉన్నారు. శ‌నివారం సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇదే విష‌యాన్ని చెప్పారు. దీనిపై త‌క్ష‌ణం స్పందించిన ముఖ్య‌మంత్రి.. ప‌దోన్న‌తుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకు ని సోమ‌వారం దీనికి సంబంధించిన జీవోను కూడా స‌ర్కారు విడుద‌ల చేసింది. వీరికి కూడా జ‌న‌వ‌రి నుంచి ప‌దోన్న‌తులు క‌ల్పించ‌నున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది.

This post was last modified on October 20, 2025 2:24 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

1 hour ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago