Political News

యాద‌వుల‌ను మెప్పించేలా సీఎం హామీలు

స‌మాజంలో కీల‌క‌మైన స్థానంలో ఉన్న యాద‌వ సామాజిక వ‌ర్గాన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా అవ‌మానించార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. వారికి గొర్రెలు, బ‌ర్రెలు మేపుకునేవారిగానే చూశార‌ని.. అన్నారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌న్నారు. ఏటా దీపావ‌ళి పండుగకు ముందు జ‌రుపుకొనే యాద‌వుల అతి పెద్ద పండుగ స‌ద‌ర్‌ను రాష్ట్ర పండుగ‌గా గుర్తించాల‌న్న విజ్ఞ‌ప్తినికూడా ప‌దేళ్ల పాల‌న‌లో ఏనాడూ కేసీఆర్ ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. తాము అధికారంలోకి రాగానే స‌ద‌ర్ పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా గుర్తించామ‌న్నారు.

తాజాగా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించిన స‌ద‌ర్ ఉత్స‌వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. యాద‌వుల‌ను త‌మ ప్ర‌భుత్వంక‌డుపులో పెట్టుకుని చూసుకుంటుంద‌న్నారు. రాష్ట్ర సాధ‌న‌లో యాద‌వ సామాజిక వ‌ర్గం ఎంతో కీల‌క పాత్ర పోషించింద‌ని తెలిపారు. వారికి అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు కూడా స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు. రాజ‌కీయంగా కూడా కాంగ్రెస్ పార్టీనే యాద‌వుల‌కు అవ‌కాశం క‌ల్పించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌త సీఎం క‌నీసం వారిని గుర్తించ‌లేక పోయార‌ని అన్నారు.

ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా యాద‌వుల‌ను కోరారు. యాద‌వుల‌కు మ‌రిన్ని రాజ‌కీయ అవ‌కాశాలు క‌ల్పించేందుకు త‌న వంతుకృషి చేస్తాన‌న్న ఆయ‌న‌.. హైద‌రాబాద్ అభివృద్ధికి యాద‌వులు క‌లిసి రావాల‌ని కోరారు. ప్ర‌తి విష‌యంలోనూ యాద‌వుల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండ‌డం గ‌మ‌నార్హం. యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నారు. సుమారు 50-60 వేల మంది యాద‌వులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి స‌ద‌ర్ ఉత్స‌వ్‌కు హాజ‌రుకావ‌డం.. వారికి రాజ‌కీయంగా అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 19, 2025 10:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

35 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago