ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతమైన ప్రధానులల ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు…భారత దేశంలోని రాష్ట్రాలలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు…ఇటువంటి డెడ్లీ కాంబినేషన్ ఉంటే ఇటు రాష్ట్రం..అటు కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయం. డేరింగ్ అండ్ డ్యాషింగ్ పీఎం మోదీ, విజనరీ సీఎం చంద్రబాబుల కాంబోలో నవ్యాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని ఆయన అన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పుకొచ్చారు. పాతికేళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, పీఎంగా మోదీ ఉన్నారని కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందని, ఈ విషయంలో సందేహం లేదని చెప్పారు. సరైన సమయంలో మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం అదృష్టమని అన్నారు.
మోదీ మాదిరి నిర్విరామంగా నిరంతరం పనిచేసే ప్రధానిని తాను చూడలేదని, 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి భారత్ చేరిందని ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపుతో 99శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి డబుల్ బెనిపిట్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందాయని అన్నారు.
This post was last modified on October 16, 2025 5:23 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…