బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి జీవిత కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతను మరేవరో కాదు, నీరజ్ సింగ్. ఒకప్పుడు ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసిన ఈ 38 ఏళ్ల యువకుడు, ఇప్పుడు రూ. 400 కోట్ల టర్నోవర్‌తో కంపెనీని నడుపుతున్నాడు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తరఫున శేవహార్ స్థానం నుంచి నీరజ్ సింగ్ బరిలోకి దిగడం, అతని స్ఫూర్తిదాయక ప్రయాణానికి మరింత బలాన్నిచ్చింది.
బీహార్‌లోని శేవహార్ జిల్లా, మథురాపూర్ గ్రామానికి చెందిన నీరజ్ సింగ్ చాలా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 13 ఏళ్లకే పదో తరగతి పాస్ అయిన తర్వాత, ఇంటికి సాయంగా ఉండాలని ఉద్యోగం కోసం వెతికారు. కానీ చిన్న వయసు కావడంతో ఎవరూ పని ఇవ్వలేదు. దాంతో గ్రామంలో పెట్రోల్, డీజిల్ అమ్మడం మొదలుపెట్టారు. మూడేళ్ల తర్వాత బతుకు తెరువు కోసం ఢిల్లీకి వెళ్లి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేశారు.
ఢిల్లీ నుంచి పుణెకు మారిన నీరజ్, అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత తన కష్టంతో, పట్టుదలతో హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్‌గా ఎదిగారు. అక్కడితో ఆగకుండా 2010లో సొంతంగా ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అక్కడే కష్టానికి తగ్గ ఫలితం దక్కింది, వ్యాపారం వేగంగా పుంజుకుంది.
ఆ తర్వాత అతను ఉషా ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. ఈ కంపెనీ ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్‌లు, టైల్స్ వంటి సిరామిక్ ఉత్పత్తులతో పాటు రోడ్ల నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఇటీవల ఒక పెట్రోల్ పంపును కూడా ప్రారంభించారు. మోతిహార్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన కంపెనీ టర్నోవర్ ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్లుగా ఉంది. ఈ సంస్థలో దాదాపు 2,000 మందికి ఉద్యోగం లభిస్తోంది.
ఒకప్పుడు సైకిల్ కూడా లేక పక్కింటి వారి సైకిల్ అడిగి వాడుకున్న నీరజ్ సింగ్, ఇప్పుడు రేంజ్ రోవర్‌తో పాటు అరడజను లగ్జరీ కార్లకు యజమాని. లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన, తన భార్య, ఇద్దరు కొడుకులు, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. వ్యాపారమే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పేద మహిళల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడం, వృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు, పుణ్యక్షేత్రాల యాత్రలు నిర్వహించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ స్థాయి నుంచి కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించిన నీరజ్ సింగ్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
This post was last modified on October 16, 2025 1:27 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…