Political News

ఆత్మ విమ‌ర్శ లేదా జ‌గ‌న్ స‌ర్‌!

ఎదుటి వారిపై ఒక వేలు చూపించేముందు నాలుగు వేళ్లు మ‌న‌వైపు చూపిస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించాలి. అది వ్య‌క్తిగ‌త‌మైనా.. రాజ‌కీయాలైనా అంతే!. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఏపీలో వెలుగు చూసిన న‌కిలీ మ‌ద్యంపై వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ఒక ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు)గా వైసీపీ ప్ర‌శ్నించ‌డం త‌ప్పుకాదు. కానీ, గ‌తంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌ని.. త‌మది స్వచ్ఛ‌మైన పాల‌న‌ని కితాబులిచ్చుకుంటున్న నేప‌థ్యంలో ఆత్మ విమ‌ర్శ లేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

న‌కిలీ మ‌ద్యం కేసులో టీడీపీ నేత జ‌య‌చంద్రారెడ్డి, ఆయ‌న సోద‌రుడు ఉన్నార‌ని తెలియ‌గానే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌ను నిర్ద్వంద్వంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌రి గ‌తంలో న్యూడ్ వీడియో కాల్స్‌తో ప‌ట్టుబ‌డిన ఎంపీ గోరంట్ల మాధ‌వ్ విష‌యంలో వైసీపీ ఏం చేసింది? ఇక‌, త‌న మాజీ డ్రైవ‌ర్‌ను చంపించి(టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌నుబ‌ట్టి).. డోర్ డెలివ‌రీ చేయించి ఎమ్మెల్సీ అనంత‌బాబు విష‌యంలో వైసీపీ ఎలా వ్య‌వ‌హ‌రించింది? అనేది జ‌గ‌న్ మ‌రిచిపోయారు.

అసెంబ్లీలో మెగా స్టార్‌పై బాల‌య్య తీవ్ర వ్యాఖ్య‌లు చేశారంటూ.. వైసీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇంకా ఈవిష‌యాన్ని ప్ర‌జ‌లు వ‌దిలేసినా.. వైసీపీ వ‌దిలేయ‌లేదు. కానీ, అదే స‌భ‌లో వైసీపీ నాయ‌కులు టీడీపీ అధినేత చంద్ర‌బాబును, ఆయ‌న స‌తీమ‌ణిని అవమానించిన‌ప్పుడు.. ఆడు-ఈడు అంటూ.. కొడాలి నాని మాజీ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు. క‌నీసం.. ఇప్పుడు చంద్ర‌బాబు స‌భ‌లో త‌మ్ముళ్ల‌ను ఘాటుగా హెచ్చ‌రించారు. త‌ర్వాత కూడా అంత‌ర్గ‌తంగా వారికి క్లాస్ ఇచ్చారు. మ‌రి ఈ త‌ర‌హా సంస్కృతి వైసీపీలో ఉందా?.. జ‌గ‌న్ ఒక‌సారి ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి.

క‌ట్టు త‌ప్పుతున్న పోలీసులు.. అంటూ.. నాడు, నేడు హైకోర్టు మంద‌లిస్తూనే ఉంది. అధికారుల‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తూనే ఉంది. సోమ‌వారం ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన పోలీసు ఉన్న‌తాధికారులు కోర్టుకు రానున్న నేప‌థ్యంలో వైసీపీ పోలీసుల‌పైనా, చంద్ర‌బాబు పాల‌న‌పైనా విమ‌ర్శ‌లు చేస్తోంది. అయితే.. ఇదే కొత్తా? వైసీపీ హ‌యాంలో అప్ప‌టి డీజీపీ గౌతం స‌వాంగ్‌, అప్ప‌టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(ఫ‌స్ట్ టైమ్ కోర్టుకు) నీలం సాహ్నిలు కోర్టు మెట్లు ఎక్క‌లేదా? ఆ సంగ‌తులు మ‌రిచిపోయారా? అప్ప‌ట్లో మౌనంగా ఎందుకు ఉన్నారో.. ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి జ‌గ‌న్.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 12, 2025 3:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

37 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago