Political News

జూబ్లీహిల్స్‌పై క‌మ‌లనాథుల దృష్టి… టికెట్ ఎవ‌రికి?

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల ఎంపికై క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ న‌లుగురి పేర్ల‌తో పార్టీ అధిష్టానానికి నివేదిక పంపించింది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కూడా త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేసింది. మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి సునీత‌కు బీఆర్ ఎస్ టికెట్ ఖ‌రారు చేసింది.

ఇక‌, ఇప్పుడు బీజేపీ వంతు కూడా వ‌చ్చింది. ఈ పార్టీ స్థానిక నాయ‌కులు.. పార్టీ చీఫ్ రామచంద్ర‌రావు.. ముగ్గురి పేర్ల‌తో కూడిన నివేదిక‌ను పార్టీఅధిష్టానానికి పంపించారు. అయితే.. వీరిలో ముగ్గురూ కూడా.. అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన వారే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి, మ‌రో ఇద్ద‌రు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు. పైగా వీరిలో ఒక‌రు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న‌వారు కూడా ఉన్నారు. దీంతో ఈ ఎంపిక విష‌యంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది చూడాలి.

ఎవ‌రెవ‌రు?

గ‌త ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి ప‌రిమిత‌మైన‌.. లంక‌ల దీప‌క్ రెడ్డి పేరు ను ఫ‌స్ట్‌లో పేర్కొన్నారు. ఈయ‌న కిష‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం బీజేపీ సెంట్ర‌ల్ ఇంచార్జ్‌గా కూడా కొన‌సాగుతున్నారు. మిగిలిన ఇద్ద‌రూ కూడా మ‌హిళా నాయ‌కులు. ఒక‌రు వీర‌ప‌నేని ప‌ద్మ‌, మ‌రొక‌రు.. జూటూరు కీర్తి రెడ్డి. వీరిద్ద‌రూ కూడా పార్టీలో బ‌ల‌మైన నాయ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికంగా కూడా వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్నారు.

ప్ర‌స్తుతం బీఆర్ ఎస్.. జూబ్లీహిల్స్‌లో రెండు ర‌కాల వ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. 1) మ‌హిళా సెంటిమెంటు.. 2) ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌. దీనిలో బీజేపీ మ‌హిళా సెంటిమెంటును అడ్డుకుని.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు జూటూరు కీర్తి రెడ్డి లేదా.. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వీర‌ప‌నేని ప‌ద్మ‌కు అవ‌కాశం ఇచ్చే చాన్స్ ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తానికి ఇప్పుడు బీజేపీ కూడా జూబ్లీహిల్స్‌పై మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.

This post was last modified on October 6, 2025 4:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

14 minutes ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

30 minutes ago

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

2 hours ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

2 hours ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago