పీకే గా ప్రచారంలో ఉన్న రాజకీయ వ్యూహ కర్త, బీహార్‌కు చెందిన జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సలహా ఖరీదు 11 కోట్ల రూపాయలని ఆయన వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(ఏ రాష్ట్రమనేది చెప్పలేదు) ఒక పార్టీకి రెండు గంటల పాటు సలహాలు.. సూచనలు, వ్యూహాలు ఇచ్చానని తెలిపారు. ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి తాను 11 కోట్ల రూపాయలను ఫీజుగా తీసుకున్నట్టు వెల్లడించారు. అంతా వైట్ మనీయేనని చెప్పారు. దీనిపై ట్యాక్సులు కూడా కట్టానన్నారు. ఇలా.. తాను.. మేథస్సు ను వినియోగించి సంపాయించుకుంటున్నానన్నారు.
ఎందుకిలా?
ప్రస్తుతం బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో 7 శాతం ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల సత్తా పీకేకు ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతోపలు పార్టీలు ఆయనను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే అసలే ఫైట్ టఫ్‌గా మారింది. ఈ క్రమంలో ఒక శాతం ఓటు బ్యాంకు చేజారినా కూడా.. ఇబ్బంది తప్పదు. అందుకే.. పీకేను వీక్ చేసేందేకు.. అధికార జేడీయూ నాయకులు, ముఖ్యంగా మంత్రులు కూడా పీకే అక్రమంగా సంపాయించిన సొమ్మును పార్టీకోసం ఖర్చు చేస్తున్నారని.. ఆయన పై కేసులు పెడతామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన ఆదాయం గురించి పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత 2014 ఎన్నికలకు ముందు.. రాజకీయ సలహాదారుగా.. వ్యూహకర్తగా ముందుకు వచ్చిన పీకే.. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు బీజేపీ వ్యూహకర్తగా అవతరించారు. ఈ క్రమంలోనే ఆయన చాయ్ పే చర్చ.. సహా అనేక కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో 2014లో బీజేపీ అదికారంలోకి వచ్చిందనే వాదన ఉంది. తర్వాత.. 2019లో ఏపీలో వైసీపీకి కూడా సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత.. తమిళనాడులోని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి కూడా.. సలహాలు ఇచ్చారు. అక్కడ కూడా అధికారంలోకి వచ్చారు. కొన్నాళ్లు కాంగ్రెస్‌కు సలహాదారుగా పనిచేసినా.. రాహుల్‌తో పడకపోవడంతో పీకే బయటకు వచ్చారు.
ప్రస్తుతం సొంత పార్టీ జన్ సురాజ్‌ను పెట్టుకుని వచ్చే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సగం మంది అభ్యర్థులను సిద్ధం చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో 7 శాతం ఓటు బ్యాంకును పీకే చీల్చే అవకాశం ఉందన్న లెక్కలు వెలుగు చూస్తున్నాయి. ఇది అటు.. అధికార కూటమి బీజేపీ-జేడీయూకు, ఇటు ఇండియా కూటమి కాంగ్రెస్-ఆర్జేడీలకు కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాల నుంచి కూడా పీకేపై రాజకీయ విమర్శలు పెరగడం గమనార్హం.
This post was last modified on September 29, 2025 5:01 pm
ఈత రాదు.. చేతులకు గ్లౌజులు లేవు.. కాళ్లకు బూట్లు కూడా లేవు. అయినా నదిలోకి దిగాడు. ప్లాస్టిక్, చెత్తతో కలుషితమైన…
ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా మొదట ప్రకటించిన డేటుకు రిలీజైతే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటోంది. ఎంత ప్రణాళికాబద్ధంగా షూటింగ్…
బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి శేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో దానిపై మంచి అంచనాలుంటాయి. ఈ వేసవిలో ‘డెకాయిట్’…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణా అధికార కాంగ్రెస్లో పరిస్థితి నూటెనిమిది డిగ్రీల సెల్సియస్ దాటింది. కొండా సురేఖ…
మంచి సినిమా తీశాం అన్న ధీమా కావచ్చు. లేదంటే సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్ కావచ్చు. ఈ…
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న…