Political News

మోడీ సేఫ్ : వారు-వీరు తేడా లేదు!

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రి చిత్ర‌మైన ఘ‌ట‌న తెర‌మీద‌కి వ‌చ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప‌నిగ‌ట్టుకుని ఆకాశానికి ఎత్తుతున్న కూట‌మి పాల‌కులు ఒక‌వైపు అయితే.. నిన్న మొన్న‌టి దాకా.. తెర‌చాటు మాత్ర‌మే మ‌ద్ద‌తు ప‌లికిన వైసీపీ ఇప్పుడు బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా.. మోడీ నామ‌స్మ‌ర‌ణ స్వ‌రాన్ని పెంచింది. వాస్త‌వానికి టీడీపీ.. బ‌హిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కాబ‌ట్టి.. మోడీనికి పొగ‌డ్డం, కేంద్రం బాగా ప‌నిచేస్తోంద‌ని కీర్తించ‌డం స‌హ‌జ‌మే. కానీ, ఎంత అభిమానం ఉన్నా.. వైసీపీ మాత్రం ఇలా బ‌య‌ట ప‌డ‌డం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది.

మొత్తంగా కూట‌మి పార్టీల‌తో పాటు వైసీపీ నాయ‌కులు కూడా మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారు-వీరు అనే తేడా లేకుండా.. మోడీని పొగుడుతున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు.. డాక్ట‌ర్ గురుమూర్తి.. ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో కేంద్రప్రభుత్వ 2,313 కోట్ల రూపాయల నిధులతో చేప‌ట్టిన‌ రెండవ దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎంపి మద్దెల గురుమూర్తి.. మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఐఐటిలో రెండవ దశ పనులు పూర్తయితే మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందన్నారు. అంతేకాదు.. ప్ర‌ధాని మోడీ దార్శ‌నిక నేతృత్వంలో దేశం పురోభివృద్ధి సాధించ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ మ‌రికొన్నాళ్లు పాల‌న సాగించాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని చెప్పారు. భార‌త్ విశ్వ‌ఖ్యాతి సాధించడానికి ప్ర‌ధాని మోడీనే కార‌ణ‌మ‌ని తెలిపారు.

ఇక‌, విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆయ‌న నాయ‌క‌త్వం అద్భుతంగా ఉంద‌న్నారు. దేశం సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో ముందుకు సాగ‌డానికి మోడీనే కార‌ణ మ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ ఉన్న‌న్నాళ్లు దేశానికి ఎలాంటి ఇబ్బంది లేద‌న్న ఆయ‌న‌.. మోడీ పేరును 32 సార్లు ప‌లికారు. ఆయ‌న‌ను 18 సార్లు పొగిడారు. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని 22 సార్లు మెచ్చుకున్నారు. ఇలా.. వారు వీరు అనే తేడా లేకుండా ప్ర‌ధానిని ఇలా పొగ‌డడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 27, 2025 3:38 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

9 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago