తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లరగట్టే…. భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో 23 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా…. ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ బదిలీల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆనంద్ స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా సీనియన్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్ నియమితులయ్యారు. ఆనంద్ ను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఇరత బదిలీలు పెద్దగా ఆసక్తి రేపకున్నా ఈ రెండు బదిలీలు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆనంద్ విడతల వారీగా హైదరాబాద్ కొత్వాల్ గా పనిచేశారు. హైదరాబాద్ పై మంచి పట్టున్న ఆనంద్ మొన్నటి వినాయక నిమజ్జనాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ఆనంద్ చూడటానికి సాఫ్ట్ గా కనిపించినా పనితీరులో మాత్రం ఆయన చాలా కఠిన వైఖరిని అవలంబిస్తారన్న వాదన ఉంది. ఆనంద్ హయాంలో నగరంలో క్రైమ్ రేట్ కూడా భారీ ఎత్తున తగ్గింది. దాదాపుగా తన సర్వీసులో సుధీర్ఘకాలం పాటు హైదరాబాద్ డీసీపీ, సీపీగా కొనసాగిన ఆయన ఇప్పుడు పరిపాలనా విధుల్లో ఏ రీతిన రాణిస్తారో చూడాలి.
ఇక హైదరాబాద్ కొత్త కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్న వీసీ సజ్జన్నార్ విషయానికి వస్తే.. ఉమ్మడి ఏపీ నుంచి కూడా ఆయనకు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుంది. నాడు వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సజ్జన్నార్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా… ఇదే తీరును కొనసాగించారు. పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కలిగించారు. ఇక ఇటీవల దిశ కేసులోనూ నిందితులను పట్టేసిన సజ్జన్నార్…సీన్ రీ కన్ స్ట్రక్షన్ కు వారిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిందితులు పారిపోయే యత్నం చేయగా…సజ్జన్నార్ వారిని కాల్చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
This post was last modified on September 27, 2025 10:50 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…