తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీసు బాసు (డీజీపీ)ని నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అక్టోబరు 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి… చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా కొనసాగుతున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆయన ఇంటెలిజెన్స్ నుంచి నేరుగా డీజీపీగా పదవి చేపట్టనున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం పరిధిలోని పెద్దతుండ్లలో జన్మించిన రెడ్డి… తన ప్రాథమిక, హైస్కూల్ విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ ఎల్ బీ చేసిన రెడ్డి… ఐపీఎస్ కు ఎంపికయ్యారు. నాడు తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో విశాఖ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన అడిషనల్ ఎస్పీగానూ, అసిస్టెంట్ ఎస్పీగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలోనూ పలు జిల్లాల్లో పనిచేసిన రెడ్డి… ఐజీ హోదా దక్కాక నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి చేరిపోయారు. చాలా కాలం పాటు ఆయన నిఘా విభాగంలోనే పనిచేశారు. ఫలితంగా నిఘా విభాగంలో రెడ్డిని మించిన అధికారి లేరంటే అతిశయోక్తి కాదు.
సాధారణంగా బీఆర్ఎస్ హయాంలోనే శివధర్ రెడ్డికి డీజీపీగా అవకాశం రావాల్సి ఉంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రతిసారీ ఆ అవకాశాలు మిస్ అవుతూనే వస్తున్నాయి. ఒకానొకసారి ఇక రెడ్డి డిజీపీగా నియమింపబోతున్నారంటూ, ఉత్తర్వులు వెలువడుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అవేవీ ఫలించలేదు. చివరకు రేవంత్ రెడ్డి సర్కారులో రెడ్డికి న్యాయం జరిగిందని చెప్పక తప్పదు. నిఘా విభాగంలో రాణించినట్లుగా డీజీపీగా రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on September 26, 2025 9:44 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…