టార్గెట్ వైసీపీ.. ఎథిక్స్ క‌మిటీ ఏం చేస్తుంది.. ?

వైసీపీ ఎమ్మెల్యేల ల‌క్ష్యంగా అసెంబ్లీ నైతిక విలువ‌ల క‌మిటీ(ఎథిక్స్‌) దృష్టి పెట్టింది. రెండు కీల‌క అంశా లపై చ‌ర్చించిన క‌మిటీ.. నిర్ణ‌యాన్ని మాత్రం వాయిదా వేసింది. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ 11 స్తానాల‌కు ప‌రిమితం అయింది. దీంతో స‌భ్యులు స‌భ‌కు రాకుండా.. డుమ్మా కొడుతున్నారు. అయితే.. స‌భ్యులు రావాలంటూ.. ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. కానీ, త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. వ‌చ్చేది లేద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఇది ఒక విధం అయితే.. మ‌రోవైపు, స‌భ్యులు స‌భ‌కు రాకుండానే.. ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటున్నా రన్న‌ది మ‌రో వాద‌న‌. స‌హ‌జంగా ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కుఏపీలో త‌ప్ప దేశంలో ఎక్క‌డా వాద‌న రాలే దు. ఒకే ఒక్క సంద‌ర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేసీఆర్ స‌భ‌కు రాక పోయినా.. 33 ల‌క్ష‌ల రూపాయ‌లు వేత‌నంగా తీసుకున్నార‌ని చెప్పారు. దీనిని అడ్డుకుంటామ‌ని వ్యాఖ్యా నించినా.. త‌ర్వాత న్యాయ‌నిపుణుల స‌ల‌హాల మేర‌కు వెన‌క్కు త‌గ్గారు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. వైసీపీ స‌భ్యులు మాత్ర‌మే ఇలా స‌భ‌కు రాకుండా జీతాలు తీసుకుంటున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. టీడీపీకి చెందిన న‌లుగురు స‌భ్యులు కూడా రావ‌డం లేదు. దీంతో వీరిపైనా చ‌ర్య‌లు తీసుకోక‌త‌ప్ప‌ద‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంది. ఇక‌, ఈ విష‌యాన్ని ఏం చేస్తారో చూడాలి. మ‌రోవైపు.. స‌భ్యులు స‌భ‌కు వ‌చ్చి సంత‌కాలు చేసి వెళ్లి పోతున్నార‌నేది మ‌రోవాద‌న‌. దీనిపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కూడా తేల్చి చెప్పారు. అంతేకాదు.. స‌భ‌లో వారు లిఖిత పూర్వ‌కంగా ప్ర‌శ్న‌లు అడుగుతున్నారని.. వాటిని ఇక నుంచి అనుమ‌తించ‌బోమ‌ని చెప్పారు.

కానీ.. ఈ రెండు విష‌యాలు ప‌రిష్క‌రించేందుకు సాధ్య‌మేనా.. అనేది ప్ర‌శ్న‌. దీనిపై ఎథిక్స్ క‌మిటీ చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, సంబంధిత ప‌త్రాల‌ను మాత్రం తీసుకు రావాల‌ని.. వ‌చ్చే స‌మావేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అయితే.. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఎలా ఉన్నా.. వైసీపీని అలెర్ట్ చేసే అవ‌కాశం ఉంది. అయితే.. దీనిని వైసీపీ పాజిటివ్ గా తీసుకుంటుందా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఎథిక్స్ క‌మిటీ చేసేది లేక‌పోయినా.. ప్ర‌స్తుతానికి మాత్రం కొంత కుదుపు అయితే తీసుకువ‌చ్చింది. మ‌రి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.