పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆయుధంతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన సాయుధ పోరు చరమాంకానికి చేరుకుంటోంది. అన్నలకు తొలిసారి వెన్నులో వణుకు పుట్టించేలా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కగార్”ను ఈ నెల 25 నుంచి మరింత విస్తరించనుంది. మరింత పటిష్టం చేయనుంది. మరింత వేగంగా కూడా చేపట్టనుంది.
అంతేకాదు, మావోయిస్టులు గతానికి భిన్నంగా చర్చలకు వస్తామని చెబుతున్నా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. “మాటల్లేవ్… తూటాలే!” అంటూ తేల్చి చెబుతోంది.
దీంతో మావోయిస్టు ఉద్యమం “మణుటయా… మరణించుటయా!” అన్నట్టుగా మారిపోయింది. కనిపించని ప్రాంతాలు అంటూ ఒకప్పుడు ఉండేవి. శత్రు దర్బేద్యంగా కూడా ఉండేవి. దీంతో గత ఆరు దశాబ్దాలుగా మావోయిస్టులు తమ కార్యక్రమాలను కొనసాగించారు. ఒక రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడితే మరో రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి అలాకాదు. శాటిలైట్ వ్యవస్థ సహా అధునాతన డ్రోన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. చిమ్మ చీకటిలోనూ మావోయిస్టుల కదలికలను పసిగట్టగల ఎనిమీ డ్రోన్లు రంగంలోకి వచ్చాయి.
ఇప్పటికే డ్రోన్లు జల్లెడ పడుతున్నాయి. దట్టమైన అడవుల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ, లోయలు, సొరంగాల్లోనూ డ్రోన్లు వెదజల్లుతున్నాయి. అన్నల ప్రాణాలను తీస్తున్నాయి. ఇక నుంచి అంటే ఈ నెల 25 నుంచి ఎనిమీ డ్రోన్లను కూబింగ్‌కు వినియోగించేలా కేంద్రం అనుమతి ఇచ్చింది.
వాస్తవానికి ఎనిమీ డ్రోన్ వ్యవస్థను కేవలం శత్రుదేశాలపై మాత్రమే వినియోగిస్తారు. సరిహద్దుల్లో భద్రత పర్యవేక్షణకు వాడతారు. కానీ తొలిసారి మావోయిస్టుల ఏరివేతకు వాడేలా అనుమతి ఇచ్చారు. ఫలితంగా మావోయిస్టులు ఎక్కడ తలదాచుకున్నా దొరికిపోవడం ఖాయం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఎట్టి పరిస్థితిలోనూ మావోయిస్టులను ఏరేస్తామని చెబుతోంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంది. వీటిలో 8 రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉంది. వీటిలో 4 రాష్ట్రాల్లో అత్యంత తీవ్రంగా ఉంది.
ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోనే కూబింగ్ ఎక్కువగా జరుగుతోంది. వీటిలో జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి.
ఈ క్రమంలో చర్చలకు అన్నలు రెడీగా ఉన్నా కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. “లొంగిపోవడమా లేక తుపాకీ తూటాలకు బలికావడమా?” అనే ఏకైక ఆప్షన్ మాత్రమే ఇచ్చింది.
అందువల్ల మావోయిస్టులు లొంగిపోతారా? లేక తుపాకీలకు బలవుతారా? అనేది చూడాలి. ఇప్పటికే మెజారిటీ నాయకత్వం బలమైన
This post was last modified on September 24, 2025 1:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…