Political News

‘మీరు ఆమోదించ‌కపోతే.. ఢిల్లీ నుంచి ఫోన్ వ‌స్తుంది’

ఏపీ శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్క‌ర‌ణ‌ల‌కు ఏపీ అసెంబ్లీ ఇటీవ‌ల ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ స‌భ్యులు మాట్లాడే స‌మయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాల‌ని ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌శ్నించారు.

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న వైసీపీ మండ‌లి ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా జీఎస్టీ దేశ‌మంతా అమ‌ల‌వుతోంద‌ని, ఒక్క ఏపీలోనే కాద‌ని అన్నారు. కానీ ఎక్క‌డా లేని విధంగా ఇక్కడే దీనిపై తీర్మానం చేశార‌ని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలోనూ ప‌య్యావుల బొత్స‌ను మ‌రోసారి మీరు ఈ తీర్మానాన్ని సూటిగా ఆమోదిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. అప్పుడు కూడా బొత్స స‌మాధానం దాట వేసి త‌న‌దైన ధోర‌ణిలోనే ప్ర‌సంగం కొన‌సాగించారు.

మ‌రోసారి జోక్యం చేసుకున్న ప‌య్యావుల‌ మాట్లాడుతూ.. మీరు ఈ తీర్మానాన్ని (జీఎస్టీ) ఆమోదిస్తారు. ఎందుకంటే మీరు దీనిని ఆమోదించ‌కపోతే మీకు, మీ నాయ‌కుడికి ఎక్క‌డ నుంచి (ఢిల్లీ పెద్ద‌ల‌) ఫోన్ వ‌స్తుందో నాకు తెలుసు. ఇక్కడ తీర్మానంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే మీ నాయ‌కుడు జీఎస్టీని ఆకాశానికి ఎత్తేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంత‌రం దీనిని స‌భ ఆమోదించిన‌ట్టుగా చైర్మ‌న్ మోషేన్ రాజు ప్ర‌క‌టించారు.

అయితే ఈ స‌మ‌యంలోనూ ప‌య్యావుల కేశ‌వ్ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌భ్యులు త‌మ అభిప్రాయాన్ని సంపూర్ణంగా చెప్ప‌కుండానే తీర్మానం ఆమోదం పొందింద‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చైర్మ‌న్‌ను నిల‌దీశారు. మీరు వైసీపీ స‌భ్యుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అయితే చైర్మ‌న్ మాత్రం మౌనంగా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి స‌భ‌కు లంచ్ బ్రేక్ ప్ర‌క‌టించారు.

This post was last modified on September 24, 2025 7:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago