బహిరంగ ప్రదేశాల్లో నేతల విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది కామనే. అయితే.. ఇటీవల కాలంలో ఈ విషయంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. విగ్రహాలకు ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంపట్ల.. చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదేసమయంలో పేదలకు అన్నం.. అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సామాజిక ఉద్యమకారులు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
“బతికి ఉన్నవారిని పట్టించుకుని.. ముందు వారి ఆకలి తీర్చండి. చనిపోయిన వారికి తర్వాత విగ్రహాలు పెట్టవచ్చు. వారిని సంతృప్తి పరవచ్చు.“ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. నేతలను కీర్తించేందుకు.. ఓటు బ్యాంకులు పెంచుకునేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని కూడా ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వాలు ఆలోచన చేయకపోతే.. తామే నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ఏనుగు విగ్రహాల ఏర్పాటును కోర్టు గుర్తు చేయడం గమనార్హం.
విషయం ఏంటి?
తమిళనాడు అంటేనే నేతల విగ్రహాలకు.. ప్రచారానికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తారు. గతంలో అధికారంలో ఉన్న జయలలిత.. వీధికో విగ్రహం పెట్టే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టు అడ్డుకుంది. ఆ తర్వాత.. వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రధాన కూడళ్లపై `అమ్మ` విగ్రహాలు ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా డీఎంకే ప్రభుత్వం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కరుణానిధి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అయితే.. ఇది కొన్నాళ్లుగా వివాదంగా మారింది.
ముఖ్యంగా తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ వెజిటేబుల్ మార్కెట్ ప్రవేశద్వారం వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం.. తీవ్ర విమర్శలకు, వివాదానికి కూడా దారితీసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కొన్నాళ్ల కిందట కోర్టు అడ్డుకుంది. విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడాన్ని కూడా తప్పుబట్టింది. దీనిని సీఎం స్టాలిన్ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. కోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏదైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలని సూచించింది.
This post was last modified on September 23, 2025 3:37 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…