ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో సొంగా రోషన్ కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కీలకమైన ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది పై వివాదాలు, విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇలానే సొంగా రోషన్ కుమార్‌పైనా చిన్నపాటి వివాదాలు ఉన్నాయి. కానీ అవేవీ ఆయనను తీవ్రస్థాయిలో కుదపేసేవి కావు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేవి కూడాకాదు.
సో.. తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలలో రోషన్ కుమార్ ఫర్వాలేదనే పరిస్థితిలోనే వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఆయన చింతలపూడిలో కొన్నాళ్లుగా ఉన్న కీలక సమస్యను పరిష్కరించారు. దీంతో ఇప్పుడు స్థానికులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
చింతలపూడిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. దీనికి గిరిజన హోదా కల్పించాలని ఎప్పటినుంచో ఇక్కడివారు కోరుతున్నారు. ఇదే జరిగితే కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయని, ఫలితంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
దీనికి సంబంధించి గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా సొంగా రోషన్ కుమార్ ఈ విషయంపై పట్టుబట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు గిరిజన ఆసుపత్రి హోదా వచ్చేలా చేశారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు.
చింతలపూడి వైద్యశాలను గిరిజన వైద్యశాలగా గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. తద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు వైద్యులు కూడా పెరుగుతారు. దీంతో స్థానికులు ఏ అవసరం వచ్చినా ఇక్కడే వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రధానంగా చింతలపూడిలో దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న రోగులు పొరుగున ఉన్న జిల్లాలకు లేదా ప్రధాన నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వ్యయప్రయాసలతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చింతలపూడి ఆసుపత్రికే గిరిజన ఆసుపత్రి హోదా దక్కడంతో కేంద్రం నుంచి నిధులు రావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో కీలక రోగాలకు ఇక్కడే చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని పడకలు కూడా వృద్ధి అవుతాయి.
ఈ వ్యవహారంలో విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేకు స్థానికంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
This post was last modified on September 23, 2025 8:16 am
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…