వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని వరుసగా రెండో రోజూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలో విచారించారు. రాజమండ్రి జైలులో ఉన్న మిథున్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నిజానికి శుక్రవారం కూడా మిథున్ రెడ్డిని విచారించారు. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన పలు అంశాలపై ఆరాతీశారు. ప్రధానంగా డిస్టిలరీలకు నిధుల టార్గెట్ పెట్టడం, కమిషన్లను రాబట్టుకోవడం, వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు దారిమళ్లించడం, అదేవిధంగా ఏ-1గా ఉన్న రాజ్‌కసిరెడ్డితో ఉన్న సంబంధం వంటి కీలక విషయాలపై కూపీ లాగే ప్రయత్నం చేశారు.
అయితే శుక్రవారం తొలి రోజు విచారణలో అడిగిన 50 ప్రశ్నలనేమరుసటి రోజు శనివారం కూడా అడిగారు. దీనికితోడు మరో నాలుగు ప్రశ్నలను జోడించారు. అయితే ఆ ప్రశ్నలకు మిథున్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పినట్టు తెలిసింది. “నిన్నే తెలియదని చెప్పా.. మళ్లీ అవే అడుగుతారెందుకు సార్. నాకు టైం వేస్టు.. మీకు కూడా టైం వేస్టు” అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంతేకాదు ఇది రాజకీయ కుట్ర పూరిత కేసు అని, తాము కడిగిన ముత్యంగా బయటకు వస్తామనే ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే కీలకమైన రూ.5 కోట్ల వ్యవహారంపై రెండో రోజు కూడా తనకు తెలియదనే సమాధానం చెప్పడంతో అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
దీంతో మిథున్‌రెడ్డి తరఫున విచారణకు వచ్చిన ఆయన లాయర్ సిట్ అధికారులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని, కోర్టు సంయమనంగా ప్రశ్నించాలనే సూచించిందని చెప్పడంతో సిట్ అధికారులు శాంతించారు. ఇక ఆ ఐదు కోట్ల రూపాయలు తమకు చెందిన పిఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే అవి ఎలా వచ్చాయో తెలియదని, వాటిని వెంటనే వెనక్కి కూడా పంపేశామని ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం చెప్పిన సమాధానాన్నే శనివారం కూడా రిపీట్ చేశారని దర్యాప్తు అధికారి ఒకరు చూచాయగా మీడియాలో వెల్లడించారు. “నిన్న చెప్పిందే చెప్పారు. అంతా సేమ్ టు సేమ్” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజమండ్రికే!
రెండు రోజుల విచారణ పూర్తికావడంతో ఎంపీ మిథున్ రెడ్డిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. ఇదేసమయంలో సోమవారం ఆయనను మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేసమయంలో మిథున్ రెడ్డి తరఫున న్యాయవాది కూడా తాము కూడా కస్టడీకి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తామని, అనవసరంగా మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారని, లేని కేసును ఉన్నట్టుగా చూపించి వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీకి రాష్ట్ర విధానాలతో సంబంధం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా కుట్ర పూరిత కేసుగానే చూస్తున్నామని తెలిపారు.
This post was last modified on September 20, 2025 10:08 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…