బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎదగాలంటే ఎవరిపైనో ఆధారపడాల్సిన అవసరం లేదని, ఆధారపడినా ఎవరూ ప్రోత్సాహం ఇవ్వరని చెప్పారు. రాజకీయాల్లో పైకి రావాలంటే పరిస్థితులను తట్టుకుని కాదు, వాటిని తోసుకుంటూ, అవరోధాలను తొక్కకుంటూ పైకి రావాలన్నారు.
అయితే, ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ బీఆర్‌ఎస్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఇంటి ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేశారు. కవితది కుటుంబ, ఆస్తి వివాదమే, కానీ.. రాజకీయాల గురిం చి కాదు అని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై నేరుగా స్పందించిన కవిత, తన గురించి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైప్రొఫైల్ నాయకుడు అని, ఆయన మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. తప్పు, దాడి ఏమీ చేయలేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో మాత్రమే స్పందించానని ఆమె చెప్పారు. ఇంతకుమించి ఏమీ అనలేదని చెప్పారు. హరిష్‌రావు పట్ల గౌరవం ఉందని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పు చేశారని చెప్పినప్పుడు బాధ కలిగిందని అన్నారు. దీనిని రాజకీయం చేయడం సరికాదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం మరియు ఇతర ప్రాజెక్టులపై దిగువ స్థాయి అధికారులు ఫైల్స్‌ను పరిశీలించకుండానే నేరుగా అప్పటి ముఖ్యమంత్రికి పంపించారని తెలిపారు. ఈ విషయాన్ని అప్పట్లోనే విభేదించానని, అప్పటి మంత్రి కేటీఆర్‌కు కూడా చెప్పానని చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్ మట్టి రిజర్వాయర్ ఎత్తును పెంచుతోందని కవిత తెలిపారు. దీనిని అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. నిజానికి ఆల్ మట్టి ఎత్తు పెంపుపై కోర్టు ఆదేశాలు, స్టే ఉన్నాయి. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఎత్తు పెంచుతోందని అన్నారు. దీనిని అడ్డుకోకపోతే, జాగృతి తరపున తామే తెలంగాణ ప్రజల కోసం కృషి చేస్తామన్నారు.
తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఎంత మంది అయినా పార్టీలు పెట్టుకోవచ్చని, ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని, ప్రజల సమస్యలపై స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆమె తాము ఏం చేస్తారన్న విషయంలో స్పందించలేదు.
మరోవైపు, ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, అయినా ఆమోదించబడలేదని చెప్పారు.
This post was last modified on September 20, 2025 2:33 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…