Political News

అయ్య‌న్న‌కు కోప‌మొచ్చిన వేళ‌.. ఏపీ అసెంబ్లీలో చిత్రం!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మరోసారి కోపం వచ్చింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి ప్రాధాన్య అంశంగా ప్రశ్నోత్తరాలు సమయానికి సమయం కేటాయిస్తారు. ఇది నిబంధనల ప్రకారం జరిగే కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులు ఏ ప్రశ్నలు అడిగారు.. మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పారు.. అనే విషయాలను అసెంబ్లీ అధికారులు నమోదు చేసుకోవాలి. వాటిని రికార్డు చేయాలి.

ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విషయంలో అసెంబ్లీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రులు కూడా సభ్యులు అడుగుతున్న ప్రశ్నల పై కాకుండా వేరే అంశాలపై తమ పక్కన కూర్చున్న సభ్యులతో చర్చించడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఇట్లాంటివి జరుగుతుండటం దురదృష్టకరమ‌ని, ఇకనుంచి ఇలాంటివి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదన్నారు. అవసరమైతే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు.

మంత్రులకు కూడా సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులుగా ఉన్నవారు బాధ్యతగా ఉండాలని సభ్యులు అడుగుతున్న ప్రశ్నల పట్ల అవగాహన లేకపోతే సమాధానం ఏం చెబుతారని ఆయన విమర్శించారు. అదే సమయంలో మంత్రులు సదరు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఊరుకోడమే కాదని, తర్వాత జరుగుతున్న అంశాలను మరుసటి రోజు సభలో చెప్పాలని కూడా ఆయన సూచించడం విశేషం. ఇక గత సభలో కూడా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు ఎమ్మెల్యేలు సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని కనీసం వారు సమాచారం కూడా సభకు ఇవ్వడం లేదని అయ్య‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సభలో మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోతుండడం ఏంటని గత సభలో ఆయన ప్రశ్నించారు. ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదన్నారు. చిత్రం ఏంటంటే ఇలా సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలలో కేవలం వైసీపీ మాత్రమే కాదు టిడిపి, బిజెపి సభ్యులు కూడా ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ చెప్పడం విశేషం.

ఇప్పుడు మరోసారి అధికారులు మంత్రులవైఖరిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా అటు సభ్యులు ఇటు మంత్రులు అధికారులు కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. సభను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న ప్రజలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను సీరియస్గా భావించడంతోపాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

This post was last modified on September 18, 2025 9:33 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago